ETV Bharat / sports

ఒక్క మ్యాచ్​తోనే ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్​లో జైస్వాల్ ఎంట్రీ.. రోహిత్, కోహ్లీ ప్లేస్ ఎంతంటే? - పుజారా టెస్టు ర్యాంకింగ్

ICC Test Rankings : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా టెస్టు ర్యాంకింగ్స్​ను ప్రకటించింది. కాగా టీమ్ఇండియా యంగ్ టాలెంటెట్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ మొదటిసారి టెస్టు ర్యాంకింగ్స్​లో చోటు దక్కించుకున్నాడు. ఇంతకీ ఎవరు ఏ స్థానంలో ఉన్నారంటే.

ICC Test Rankings
ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్​
author img

By

Published : Jul 19, 2023, 6:36 PM IST

ICC Test Rankings : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్​లో.. టీమ్ఇండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ అరంగేట్ర మ్యాచ్​తోనే స్థానం సంపాదించాడు. తాజా ర్యాంకింగ్స్​లో జైస్వాల్ 73 ప్లేస్​లో కొనసాగుతున్నాడు. అయితే టాప్ 10 బ్యాటర్ల లిస్ట్​లో.. టీమ్ఇండియా నుంచి భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కడే చోటు దక్కించుకున్నాడు. రోహిత్ 751 పాయింట్లతో 10వ స్థానంలో నిలిచాడు. టీమ్​ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ (750 పాయింట్లు) 11వ స్థానం, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (711 పాయింట్లు) 14వ స్థానంలో కొనసాగుతున్నాడు. గత కొద్ది కాలంగా పేలవ ప్రదర్శన చేస్తున్న టీమ్ఇండియా నయావాల్ ఛెతేశ్వర్ పుజారా మూడు స్థానాలు కోల్పోయి (612 పాయింట్లు) 29వ స్థానంలో నిలిచాడు.

  • న్యూజిలాండ్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ 883 పాయింట్లతో టాప్​లో నిలిచాడు.
  • ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ 874 పాయింట్లలో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.
  • పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ అజామ్ 862 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.
  • ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ 855 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
  • మరో ఆస్ట్రేలియన్​ ఆటగాడు మార్నస్ లుబుషేన్ 849 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా టాప్ 5లో ముగ్గురు ఆసిస్ బ్యాటర్లు ఉండటం విశేషం.

ICC Test Bowler Rankings : బౌలర్లలో టీమ్ఇండియా స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ 860 పాయింట్లతో టాప్​లో ఉన్నాడు. అతడి తర్వాత కమిన్స్ (828 పాయింట్లు), రబాడ (825 పాయింట్లు) వరుస స్థానాల్లో కొనసాగుతున్నారు. కాగా టీమ్ఇండియా పేస్ బౌలర్ జస్​ప్రీత్ బుమ్రా (772 పాయింట్లు), లెఫ్ట్​ఆర్మ్​ స్పిన్నర్ రవీంద్ర జడేజా (765 పాయింట్లు) తొమ్మిది, పది స్థానాల్లో ఉన్నారు.

ICC Test All Rounder Rankings : ఇక ఆల్​రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా (449 పాయింట్లు), అశ్విన్ (362 పాయింట్లు) టాప్​లో కొనసాగుతున్నారు.

India Tour Of West Indies 2023 : కాగా వెస్టిండీస్​ పర్యటనలో మొదటి టెస్టు మ్యాట్​లో అదగొట్టిన జైస్వాల్.. ఒక్క మ్యాచ్​తోనే ఐసీసీ ర్యాంకింగ్స్​ లిస్ట్​లోకి ఎంట్రీ ఇచ్చాడు. అదే మ్యాచ్​లో సెంచరీతో అదరగొట్టిన టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి టాప్​ 10లోకి దూసుకొచ్చాడు. ఈ ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్​ గురువారం ( జులై 20న) ప్రారంభంకానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.