ETV Bharat / sports

ఆస్ట్రేలియాకు టీమ్​ఇండియా.. టీ20 వరల్డ్​కప్​ వేటకు రెడీ.. బీసీసీఐ పోస్ట్​ వైరల్​!

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కోసం టీమ్​ఇండియా.. ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లింది. గురువారం తెల్లవారుజామున ముంబయి ఎయిర్​పోర్ట్​లో ఫ్లైటెక్కింది. అయితే అందుకు సంబంధించిన ఫొటోతో బీసీసీఐ చేసిన పోస్ట్​.. ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

icc t20 world cup rohit sharma led indian team departs for australia

author img

By

Published : Oct 6, 2022, 10:54 AM IST

Team India flies to Australia: టీమ్​ఇండియా టీ20 వరల్డ్‌కప్‌ వేట కోసం ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లింది. ఓవైపు యంగ్​ ఇండియా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు సిద్ధమవుతున్న సమయంలోనే వరల్డ్‌కప్‌ ఆడే టీమ్‌ గురువారం తెల్లవారుజామున ముంబయి ఎయిర్​పోర్ట్​లో ఫ్లైట్​ ఎక్కింది. 15 మంది సభ్యుల టీమ్‌ వెళ్లాల్సి ఉన్నా.. బుమ్రా దూరం కావడం, అతడి స్థానంలో ఇంకా ఎవరినీ తీసుకోకపోవడంతో 14 మందే ఆస్ట్రేలియాకు వెళ్లారు.

ఆస్ట్రేలియాకు వెళ్లిన తర్వాతే అక్కడి పరిస్థితులను బట్టి బుమ్రా స్థానంలో ఎవరిని తీసుకోవాలో నిర్ణయిస్తామని కెప్టెన్‌ రోహిత్ చెప్పిన విషయం తెలిసిందే. టీమ్​ఇండియా ఆస్ట్రేలియా బయలుదేరే ముందు గ్రూప్‌ ఫొటో దిగింది. ఈ ఫొటోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. "పిక్చర్‌ పర్ఫెక్ట్‌. మనం సాధిద్దాం టీమ్​ఇండియా. వరల్డ్‌కప్‌, వచ్చేస్తున్నాం" అని బీసీసీఐ ఈ ఫొటోకు క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్​ సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

icc t20 world cup rohit sharma led indian team departs for australia
బీసీసీఐ ట్వీట్​

ఫ్లైట్‌ ఎక్కే ముందు ఇండియన్‌ క్రికెటర్లు కూడా గ్రూపులుగా ఫొటోలు దిగారు. మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కూడా హర్షల్‌ పటేల్‌, యుజ్వేంద్ర చాహల్‌లతో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. "ఆస్ట్రేలియా వెళ్తున్నాం. ఉత్సాహకరమైన రోజులు ముందున్నాయి" అంటూ చాహల్‌, హర్షల్‌ను ట్యాగ్‌ చేశాడు కోహ్లీ.

కోహ్లీ ట్వీట్​

ఇక స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా ఒక ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఇందులో కెప్టెన్‌ రోహిత్‌శర్మ, రిషభ్​ పంత్‌, దినేశ్​ కార్తీక్‌ ఎంతో కాన్ఫిడెంట్‌గా స్మైల్‌ ఇస్తూ కెమెరాకు ఫోజులిచ్చారు.

సూర్య కుమార్​ యాదవ్​ ట్వీట్​

ఈ ఏడాది వరల్డ్‌కప్‌ వేటను పాకిస్థాన్‌తో మ్యాచ్‌తోనే రోహిత్​ సేన ప్రారంభించనుంది. అక్టోబర్‌ 23న ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఈ దాయాదుల మ్యాచ్‌ జరగనుంది. అంతకుముందు వెస్టర్న్‌ ఆస్ట్రేలియా టీమ్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలతో వార్మప్‌ మ్యాచ్‌లు ఆడనుంది భారత్​.

ఇవీ చదవండి: లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఛాంపియన్‌గా ఇండియా క్యాపిటల్స్​

2023 ప్రపంచ కప్​.. నా టార్గెట్: తాత్కాలిక కెప్టెన్‌ ధావన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.