ETV Bharat / sports

ICC ODI Ranking 2023 : టాప్​ ప్లేస్​కు అతిదగ్గరలో గిల్-సిరాజ్.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ రిలీజ్

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2023, 3:07 PM IST

Updated : Oct 25, 2023, 3:41 PM IST

ICC ODI Ranking 2023 : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్.. బుధవారం వన్డే ర్యాంకింగ్స్ విడుదల చేసింది. తాజా ర్యాంకింగ్స్​లో టీమ్ఇండియా యంగ్​ బ్యాటర్ శుభ్​మన్ గిల్.. టాప్​లో ఉన్న బాబర్​కు అతి చేరువలోకి వచ్చాడు.

ICC ODI Ranking 2023
ICC ODI Ranking 2023

ICC ODI Ranking 2023 : ఐసీసీ బుధవారం వన్డే ర్యాంకింగ్స్ విడుదల చేసింది. తాజా ర్యాంకింగ్స్​లో టీమ్ఇండియా ఓపెనర్ శుభ్​మన్ గిల్ (823 రేటింగ్స్​)​.. టాప్​లో ఉన్న పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ (829 రేటింగ్స్)కు అతి చేరువలోకి వచ్చాడు. వీరిద్దరూ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ హెన్రీచ్ క్లాసెన్ ఏకంగా ఏడు స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. ప్రస్తుతం అతడు 756 రేటింగ్స్​తో నాలుగో ప్లేస్​ దక్కించుకున్నాడు. మరో సౌతాఫ్రికా ప్లేయర్ క్వింటన్ డికాక్.. 769 రేటింగ్స్​తో మూడో స్థానంలో ఉండగా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (747 రేటింగ్స్) ఐదో స్థానం, కెప్టెన్ రోహిత్ శర్మ (725 రేటింగ్స్) ఎనిమిదో ప్లేస్​లో కొనసాగుతున్నారు.

ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాటర్ డేవిడ్ వార్నర్.. (747 రేటింగ్స్) విరాట్​తో కలిసి ఐదో స్థానంలో ఉన్నాడు. సౌతాఫ్రికా బ్యాటర్ రస్సీ వాన్ డర్​ డస్సెన్ (716 రేటింగ్స్) నాలుగు స్థానాలు దిగజారి తొమ్మిదో ర్యాంక్​కు పడిపోయాడు. ఇక ఇటీవలె ప్రపంచకప్​లో భారత్​పై సూపర్ సెంచరీతో చెలరేగిన డ్యారిల్ మిచెల్.. 16 స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. ప్రస్తుతం మిచెల్ (668 రేటింగ్స్)తో 13వ ప్లేస్​ దక్కించుకున్నాడు. ఇక టాప్​ 10లో భారత్ నుంచి ముగ్గురు, సౌతాఫ్రికా నుంచి ముగ్గురు ఆటగాళ్లు ఉండడం విశేషం.

టాప్ పొజిషన్​కు అతి చేరువలో సిరాజ్.. బౌలింగ్ విభాగంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హజెల్​వుడ్ 670 రేటింగ్స్​తో అగ్రస్థానంలో ఉండగా.. టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ 668 రేటింగ్స్​తో, కేవలం రెండు పాయింట్ల తేడాతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. సౌతాఫ్రికా బౌలర్ కేశవ్ మహరాజ్.. (656 రేటింగ్స్) కెరీర్ బెస్ట్​ ర్యాంక్​ దక్కించుకున్నాడు. అతడు మూడో ప్లేస్​లో కొనసాగుతున్నాడు. ఇక టీమ్ఇండియా స్పిన్నర్ కుల్​దీప్ యాదవ్ (632 రేటింగ్స్) తొమ్మిదో స్థానం, పేసర్ జస్​ప్రీత్ బుమ్రా (620 రేటింగ్స్​) 13వ ప్లేస్​లో ఉన్నారు.

ఆల్​రౌండర్ ర్యాంకింగ్స్.. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్​ అల్ హసన్ ఈ లిస్ట్​లో (324 రేటింగ్స్) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టీమ్ఇండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య.. 219 రేటింగ్స్​తో తొమ్మిదో ప్లేస్​లో ఉన్నాడు. కాగా, టీమ్ఇండియా నుంచి ఈ జాబితాలో హార్దిక్ ఒక్కడే ప్లేస్ దక్కించుకున్నాడు.

ICC ODI Ranking 2023 : ఐసీసీ ర్యాంకింగ్స్​లో రాకెట్​లా దూసుకెళ్లిన సిరాజ్.. ఒక్క మ్యాచ్​తోనే లెక్కలు మార్చేశాడు

ICC Rankings: వన్డేల్లో బుమ్రా మళ్లీ నంబర్​ వన్​.. టీ20లో 5వ స్థానానికి సూర్య

Last Updated : Oct 25, 2023, 3:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.