ETV Bharat / sports

'భారత్‌ను ఆ జట్టు ఓడించడం ఆశ్చర్యంగా ఉంది' - టీమ్ఇండియా వర్సెస్​ దక్షిణాఫ్రికా

Ian chappell IND Vs Southafrica test series: యువ క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను గుర్తించగలిగే శక్తి సెలక్టర్లలో ఉండాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ ఛాపెల్‌ సూచించాడు. కాగా, ఇటీవల జరిగిన టెస్టు సిరీస్​లో టీమ్​ఇండియాను దక్షిణాఫ్రికా ఓడించడం ఆశ్చర్యకరంగా ఉందని అన్నాడు.

chappell
ఇయాన్​
author img

By

Published : Jan 17, 2022, 5:58 AM IST

Ian chappell IND Vs Southafrica test series: యువ క్రీడాకారుల్లో ఉన్న టాలెంట్‌ను గుర్తించగలిగే సెలక్టర్లు ఉండాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ ఛాపెల్‌ సూచించాడు. దీనికి ఉదాహరణగా దక్షిణాఫ్రికా ఆటగాడు కీగన్‌ పీటర్సన్‌ ఎంపికను పేర్కొన్నాడు. భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను సఫారీల జట్టు గెలుచుకోవడంలో పీటర్సన్‌ కీలకపాత్ర పోషించాడు. అంతేకాకుండా ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య భావోద్వేగపూరితమైన సంఘటనలూ చోటు చేసుకున్నాయని, ఇదే యాషెస్‌ సిరీస్‌లో కొరవడిందని ఛాపెల్‌ పేర్కొన్నాడు.

"భారత్‌ను దక్షిణాఫ్రికా ఓడించడం ఆశ్చర్యకరంగా ఉంది. అంతేకాకుండా ఇరు జట్ల ఆటగాళ్లలో గెలవాలనే కసి కనిపించింది. అయితే ఇదే యాషెస్‌ సిరీస్‌లో లోపించింది. ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలు రాకపోవడం కూడా సర్‌ప్రైజ్‌గా ఉంది" అని వివరించాడు. యాషెస్‌ సిరీస్‌ను ఆస్ట్రేలియా 4-0 ఆధిక్యంతో ఇంగ్లాండ్‌పై గెలిచి కైవసం చేసుకుంది.

"బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌ల మీద డీన్‌ ఎల్గర్‌, తెంబా బవుమా, కేఎల్‌ రాహుల్‌, విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌లు ప్రత్యేకంగా నిలిచాయి. అలానే స్కోరింగ్‌ను దృష్టిలో ఉంచుకుని కీగన్‌ పీటర్సన్, రిషభ్‌ పంత్‌ షాట్ సెలక్షన్‌ కూడా బాగుంది. మరీ ముఖ్యంగా పీటర్సన్‌ అయితే దూకుడుగా బ్యాటింగ్‌ చేయవచ్చని నిరూపించాడు. ఇదే టెస్టు క్రికెట్‌ మిస్టరీస్‌లో బట్టబయలు చేస్తుంది. కొంతమంది సెలక్టర్లు వారు దేని కోసం వెతుకుతున్నారో కూడా తెలియదు" అని విశ్లేషించాడు. పీటర్సన్‌ (28) కేవలం ఆడింది ఐదే టెస్టులని, అనుభవం లేకపోయినా షాట్ల ఎంపిక అద్భుతంగా ఉందని కొనియాడాడు.

ఇదీ చూడండి: ఈ బల్లెం భామను చూస్తే ఎవరైనా టెంప్ట్ ​అవ్వాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.