ETV Bharat / sports

ఇక మళ్లీ క్రికెట్ ఆడతానో లేదో అనుకున్నా: అశ్విన్

Ashwin Last Test: న్యూజిలాండ్​తో జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా స్పిన్నర్ అశ్విన్ ఓ ఘనత సాధించాడు. భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డు నెలకొల్పి హర్భజన్‌సింగ్‌ (417)ను అధిగమించాడు. ఈ నేపథ్యంలోనే స్పందించిన అశ్విన్.. గతేడాది కివీస్​తో మ్యాచ్ సమయంలో ఇక తాను క్రికెట్ మళ్లీ ఆడతానో? లేదో? అనే ఆందోళన కలిగిందని వెల్లడించాడు.

Ashwin
అశ్విన్
author img

By

Published : Nov 30, 2021, 4:29 PM IST

Ashwin Last Test: గతేడాది న్యూజిలాండ్‌ పర్యటన సందర్భంగా తాను మళ్లీ క్రికెట్‌ ఆడతానా లేదా అనే సందిగ్ధంలో ఉన్నానని.. అప్పుడు తన జీవితంలో ఏం జరుగుతుందోననే ఆందోళన కలిగిందని టీమ్ఇండియా సీనియర్‌ ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. తాజాగా అతడు టెస్టు క్రికెట్‌లో టీమ్‌ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డు నెలకొల్పి హర్భజన్‌సింగ్‌ (417)ను అధిగమించాడు. కాన్పూర్‌ వేదికగా కివీస్‌తో ఆడిన తొలి టెస్టులో అశ్విన్‌ సోమవారం 419వ వికెట్‌ సాధించడం ద్వారా ఈ ఘనత అందుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం శ్రేయస్‌ అయ్యర్‌తో నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అశ్విన్.

"క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా 2020 ఫిబ్రవరి 29న న్యూజిలాండ్‌తో టీమ్‌ఇండియా తలపడిన రెండో టెస్టులో నేను ఆడలేదు. దీంతో ఆరోజే నేను మళ్లీ క్రికెట్‌ ఆడతానా? లేదా? అనే సందిగ్ధంలో పడిపోయా. నా భవిష్యత్‌ ఎటు పోతుంది? నేను ఆడే ఏకైక ఫార్మాట్‌ టెస్టు క్రికెట్‌. అందులో మళ్లీ కొనసాగుతానా? అనిపించింది. కానీ, దేవుడు నా పట్ల దయ చూపించాడు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని మళ్లీ రాణించా. తర్వాత నేను నీ (శ్రేయస్‌) సారథ్యంలో దిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో ఐపీఎల్‌ ఆడాను. అక్కడి నుంచే నా పరిస్థితులు మారిపోయాయి" అని అశ్విన్‌ చెప్పుకొచ్చాడు.

హర్భజనే నాకు ప్రేరణ..

ఇక తాను ఆఫ్ స్పిన్నర్‌గా మారడానికి హర్భజన్‌సింగే ప్రధాన కారణమని అశ్విన్‌ చెప్పాడు. "నేనెప్పుడూ ఆఫ్‌ స్పిన్నర్‌ అవుతానని ఊహించలేదు. 2001లో ఆసీస్‌పై టీమ్‌ఇండియా గెలిచినప్పుడు భజ్జీ బౌలింగ్‌ చూసి మంత్రముగ్ధుడినయ్యా. అప్పుడే తొలిసారి హర్భజన్‌ను చూశా. దాంతో ఆ సిరీస్‌ తర్వాత బంతి అందుకొని ఆఫ్‌స్పిన్‌ వేయడం ప్రారంభించా. చివరికి ఇలా ఈ స్థాయికి చేరుకున్నా. నన్ను ఎంతగానో ప్రేరేపించిన హర్భజన్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞత చెప్పాలనుకుంటున్నా. అతడి రికార్డును చేరుకోవడం గొప్ప మైలురాయి. ఇది ఎంతో గర్వించాల్సిన విషయం" అని వెటరన్‌ స్పిన్నర్ సంతోషంగా వివరించాడు.

ఇవీ చూడండి: 'టీమ్ఇండియా ఆలోచనా విధానంతో షాకయ్యా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.