ETV Bharat / sports

వాసన, రుచి కోల్పోయినట్లు ఇప్పటికీ అనిపిస్తోంది: వరుణ్ - IPL CORONA

కరోనా నుంచి కోలుకున్నప్పటికీ, ఇంకా బలహీనంగానే అనిపిస్తోందని యువ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చెప్పాడు. అది తగ్గిన తర్వాత శిక్షణ కొనసాగిస్తానని స్పష్టం చేశాడు.

I haven't resumed training due to post-Covid symptoms: Varun Chakravarthy
వరుణ్ చక్రవర్తి
author img

By

Published : May 23, 2021, 7:07 AM IST

Updated : May 23, 2021, 8:18 AM IST

"కరోనా నెగెటివ్ వచ్చినా ఇప్పటికీ బలహీనంగా అనిపిస్తుండడం వల్ల ఇంకా శిక్షణ మొదలుపెట్టలేకపోతున్నాను" అని కోల్​కతా నైట్ రైడర్స్ ఆఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అన్నాడు. ఈసారి ఐపీఎల్ లో కరోనా సోకిన తొలి ఆటగాడు వరుణే. కరోనా నుంచి కోలుకున్న ఈ 29 ఏళ్ల స్పిన్నర్ ప్రస్తుతం చెన్నైలోని తన ఇంట్లో ఉన్నాడు.

"ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉన్నా, కొవిడ్ తర్వాత ఎదురయ్యే అనారోగ్య సమస్యల కారణంగా ఇప్పటికీ పూర్తిస్థాయిలో శిక్షణ మొదలు పెట్టలేకపోతున్నా. నాకేమీ జ్వరం, దగ్గు లేవు. కానీ చాలా బలహీనంగా, మత్తుగా అనిపిస్తోంది. వాసన, రుచి కోల్పోయినట్టు ఇప్పటికీ అప్పుడప్పుడు అనిపిస్తోంది. కానీ త్వరలోనే మళ్లీ శిక్షణ కొనసాగిస్తాననే నమ్మకంతో ఉన్నాను" అని వరుణ్ చెప్పాడు.

కొవిడ్ 19 నుంచి కోలుకున్నా.. ప్రతి ఒక్కరికి కనీసం రెండు వారాల పూర్తి విశ్రాంతి అవసరమని అతడు పేర్కొన్నాడు. "కరోనా నుంచి బయటపడి నెగిటివ్ వచ్చినా కనీసం రెండు వారాల విశ్రాంతి అవసరం. ఇది అథ్లెట్లకే కాదు ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. నెగెటివ్ వచ్చినా అందరూ మాస్కు ధరించాలి.. దీని వల్ల చుట్టుపక్కల ఉండేవాళ్లకు ఇబ్బంది ఉండదు" అని వరుణ్ చెప్పాడు.

ఇవీ చదవండి:

Last Updated : May 23, 2021, 8:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.