Hardik Pandya vs Pakistan : 2023 ఆసియా కప్‌లో భాగంగా శనివారం నాటి భారత్ పాకిస్థాన్ మ్యాచ్ రద్దైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ పేసర్ల ధాటికి భారత్ 66 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ (82) , ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య (87) అద్భుత పోరాటంతో భారత్‌ను ఆదుకున్నారు. ఒకవేళ వీరిద్దరు భాగస్వామ్యంలో ఇండో- పాక్ మ్యాచ్ అనగానే.. అందరికీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీయే గుర్తొస్తాడు. కానీ పాక్‌తో మ్యాచ్‌లో విరాట్ ఒక్కడే కాదు. జట్టులోని మరో ప్లేయర్ కూడా టీమ్ఇండియా కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఆదుకున్నాడు అతడే హార్దిక్ పాండ్య. మరి అతడు ఏయే టోర్నీల్లో భారత్‌ను ఆదుకున్నాడో తెలుసుకుందాం..
- 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.
2017 ఛాంపియన్స్ ట్రోఫీలో ధోనీ సారధ్యంలో భారత్ ఫైనల్స్ చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 338-4 స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా 54 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన హార్దిక్ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి కేవలం 43 బంతుల్లోనే 76 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో హర్దిక్.. భారత్‌ను గెలిపించలేకపోయినప్పటికీ.. ఓటమి అంతరాన్ని తగ్గించాడు. - 2022 ఆసియా కప్..
2022 ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో పాక్.. 19.5 ఓవర్లకు 147 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యం చిన్నదే అయినా భారత్ తడబడింది. రోహిత్, కోహ్లీ సహా 53 పరుగులకే టీమ్ఇండియా మూడు వికెట్లు కోల్పోయింది. ఆఖర్లో భారత్ విజయానికి 18 బంతుల్లో 32 పరుగులు కావాల్సిన దశలో.. హార్దిక్ దుమ్ముదులిపాడు. 17 బంతుల్లోనే 4 ఫోర్లు, ఓ సిక్స్ సహా.. 33 పరుగులు చేసి, 19.4 ఓవర్లలోనే భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డునూ పొందాడు. - 2022 టీ20 వరల్డ్ కప్..
గత పదేళ్లలో అసలైన మాజా ఇచ్చిన ఇండోపాక్ పోరు ఇదే. ఈ మ్యాచ్‌లో 160 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 31కే నాలుగు వికెట్లు పారేసుకుంది. చివర్లో భారత్ గెలుపునకు 30 బంతుల్లో 60 పరుగులు కావాలి. ఈ దశలో విరాట్-హార్దిక్ అద్భుతమైన భాగస్వామ్యంతో.. ఓటమి అంచున ఉన్న భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్‌లో విరాట్ 82 పరుగులు చేశాడు. హార్దిక్ 40 పరుగుల ఇన్నింగ్స్ మ్యాచ్‌లో కీలకంగా మారింది. - 2023 ఆసియా కప్..
తాజాగా శనివారం నాటి మ్యాచ్‌లో హార్దిక్ క్రీజులోకి వచ్చేసమయానికి భారత్ 4 వికెట్లు కోల్పోయింది. పాండ్య, ఇషాన్‌తో కలిసి నెలకొల్పిన భాగస్వామ్యం భారత్‌కు కీలకమైంది. ఒకవేళ ఇషాన్‌తో కలిసి హార్దిక్ పార్ట్నర్షిప్ చేయకపోయుంటే.. భారత్ ఇన్నింగ్స్ త్వరగా ముగిసేదని క్రీడా విశ్లేషకుల అభిప్రాయం. అదే జరిగి ఉంటే పాక్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చేది. దీంతో పాక్ గెలిచేదని నెట్టింట చర్చ జరుగుతోంది
'టీమ్ ప్లేయర్స్ ఎలా ఆడారనేది నాకు తెలుసు.. ఒక్కోసారి ఓటమి నుంచే పాఠాలు'
IND Vs WI : 'టీ20ల్లో అంతే.. ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేం.. ఫ్యూచర్ స్టార్ ప్లేయర్లు వారే!'