ETV Bharat / sports

T20 Worldcup: 'ప్రపంచకప్​లో అఫ్గాన్ ఆడటం కుదరదు' - టీ20 ప్రపంచకప్

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup) అఫ్గానిస్థాన్​ జట్టు ఆడటం కష్టమే అని అభిప్రాయపడ్డాడు ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ పైన్(Tim Paine news). మహిళా క్రికెటర్లను ప్రోత్సహించని అఫ్గాన్​ జట్టును టోర్నీ నుంచి బహిష్కరించాలని కోరాడు.

tim paine
టిమ్ పైన్
author img

By

Published : Sep 10, 2021, 12:11 PM IST

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) అఫ్గానిస్థాన్​ జట్టుతో క్రికెట్ ఆడేందుకు ఇతర జట్లు కూడా విముఖత చూపుతాయని ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ పైన్ అన్నాడు. తాలిబన్ల పాలన నేపథ్యంలో మహిళా క్రికెటర్లను ప్రోత్సహించకపోతే.. నవంబర్​లో అఫ్గాన్, ఆస్ట్రేలియా(Afghanistan vs Australia) జట్ల మధ్య టెస్టు మ్యాచ్​ జరగదని క్రికెట్​ ఆస్ట్రేలియా ప్రకటించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు పైన్(Tim Paine news).

క్రికెట్​ విషయంలోనూ మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడితే.. ఆస్ట్రేలియా జట్టు టెస్టు మ్యాచ్​ ఆడబోదని ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్(Australia Cricketers Association) తేల్చి చెప్పింది. ఈ నిర్ణయాన్ని సమర్థించిన పైన్.. అఫ్గాన్​ లాంటి జట్టును మెగాటోర్నీలో ఆడేందుకు ఐసీసీ ఎలా అనుమతిస్తుందో చూడాలని ఉందని అన్నాడు.

"క్రికెట్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా ప్రభుత్వం, ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అసోసియేషన్ దీనిపై స్పందించారు. కానీ, ఐసీసీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. నెలరోజుల్లో టీ20 ప్రపంచకప్​ జరగనుంది. అందులో అఫ్గాన్​ టీమ్​ కూడా ఉండటం ఆశ్యర్చకరం. వెంటనే అఫ్గాన్ టీ20 ప్రపంచకప్​లో ఆడే విషయమై ఐసీసీ స్పందించాలి."

-టిమ్ పైన్, ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్.

పలు దేశాలు అఫ్గాన్​తో ఆడేందుకు విముఖత చూపితే, వారి దేశంలోకి అఫ్గాన్​ ఆటగాళ్లను అడుగుపెట్టనీయకపోతే.. ఆ జట్టు టీ20 ప్రపంచకప్​లో ఎలా ఆడుతుంది? అని అన్నాడు ఆస్ట్రేలియా సారథి పైన్. అఫ్గాన్​ జట్టును టోర్నీలో భాగస్వామ్యం చేయకూడదని పేర్కొన్నాడు.

తమ దేశం తరఫున మహిళలు క్రికెట్​ ఆడాల్సిన పనిలేదని ఇటీవలే తాలిబన్ నేత ఒకరు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్​ బోర్డు నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే.. దీనిపై ఐసీసీ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఇదీ చదవండి:

T20 worldcup: కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న రషీద్ ఖాన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.