ETV Bharat / sports

T20 India Vs Pakistan: షోయబ్‌ అక్తర్‌కు చురకంటించిన భజ్జీ - హర్భజన్ సింగ్ ట్వీట్​

పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌కు టీమ్‌ఇండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ మరోసారి చురక అంటించాడు. అక్తర్‌ చేసిన ఓ సరదా ట్వీట్‌కు(Shoaib Akhtar Tweet) భజ్జీ తనదైనశైలిలో సమాధానమిచ్చాడు(Harbhajan Singh On Shoaib Akhtar). ప్రస్తుతం ఈ ట్వీట్స్​ వైరల్​గా మారాయి.

harbhajan reply on shoaib akhtar tweet
షోయబ్ అక్తర్ ట్వీట్​
author img

By

Published : Oct 18, 2021, 3:19 PM IST

పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌కు టీమ్‌ఇండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ తాజాగా మరోసారి చురక అంటించాడు. ఎన్నో ఏళ్లుగా వీరిద్దరి మధ్య అటు మైదానంలో, ఇటు సామాజిక మాధ్యమాల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అక్తర్‌ చేసిన ఓ సరదా ట్వీట్‌కు భజ్జీ తనదైనశైలిలో(Harbhajan Singh On Shoaib Akhtar) స్పందించాడు. అతడి పోస్టుకు దీటుగా(Harbhajan Singh On Shoaib Akhtar) బదులిచ్చాడు.

చర్చా కార్యక్రమంలో..

రాబోయే ఆదివారం భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య టీ20 ప్రపంచకప్‌లో మరో కీలక పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్‌ విశ్లేషణ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇరు జట్లలోని పలువురు దిగ్గజ క్రికెటర్లు దుబాయ్‌కు చేరుకున్నారు. హర్భజన్‌, అక్తర్‌ ఓ చర్చా వేదికలో పాల్గొన్నారు. ఆ ఫొటోను పాక్‌ మాజీ పేసర్‌ ట్విటర్‌లో పంచుకొని.. 'అన్నీ తెలుసనుకునే మిస్టర్‌ హర్భజన్‌ సింగ్‌తో భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు ముందు దుబాయ్‌లో చర్చా కార్యక్రమంలో పాల్గొన్నాను' అంటూ అక్తర్‌ పోస్టు చేశాడు. దీనికి స్పందించిన హర్భజన్‌ చురక అంటించాడు. 'టెస్టుల్లో 200 వికెట్ల కన్నా తక్కువ ఉన్న ఆటగాడి కంటే.. 400కి పైగా వికెట్లున్న ఆటగాడికే క్రికెట్‌ గురించి ఎక్కువ తెలుసు' అని దీటుగా స్పందించాడు. టెస్టుల్లో అక్తర్‌ 178 వికెట్లు తీయగా.. హర్భజన్‌ 417 వికెట్లు తీశాడు.

harbhajan reply on shoaib akhtar tweet
షోయబ్ అక్తర్ ట్వీట్​కు భజ్జీ రిప్లై

మరోవైపు షోయబ్‌ అక్తర్‌.. టీమ్‌ఇండియా దిగ్గజాలైన సునీల్‌ గావస్కర్‌, కపిల్‌దేవ్‌కు సరదాగా ఒళ్లు పట్టిన ఫొటోలను కూడా ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. 'క్రికెట్‌లో ఉత్తమ ఆటగాళ్లకే అత్యుత్తమ ఆటగాళ్లైన గావస్కర్‌, కపిల్‌ దేవ్‌, జహీర్‌ అబ్బాస్‌లాంటి దిగ్గజాలతో సరదాగా' అంటూ మరో ట్వీట్‌(Shoaib Akhtar Tweet) చేశాడు. అయితే, ఈ ఫొటోలపై అతడికి సొంత అభిమానుల నుంచి వ్యతిరేకత ఎదురవ్వడం గమనార్హం. కాగా, భారత్‌-పాక్‌ చివరిసారి 2019 వన్డే ప్రపంచకప్‌లో తలపడ్డాయి. భారత్‌ ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే తలపడుతున్నాయి. అయితే, ప్రపంచకప్‌ల చరిత్రలో పాకిస్థాన్‌పై భారత్‌కు సంపూర్ణ ఆధిక్యం ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లోనూ టీమ్‌ఇండియానే గెలుస్తుందని అభిమానులు ధీమాగా ఉన్నారు.

ఇవీ చూడండి:

T20 World Cup 2021: విరాట్, రోహిత్​.. ఈ రికార్డులు బ్రేక్ చేస్తారా?

IPL RCB: బెంగళూరు 'బెంగ' తీర్చే కెప్టెన్ ఎవరు?

Csk win ipl: 'చెన్నై'కి కింగ్​ అయినా తల్లికి కొడుకే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.