ETV Bharat / sports

Rohit Sharma: ఆ ఫీలింగ్ గొప్పగా ఉంది: రోహిత్​ శర్మ - టీమ్​ఇండియా

Rohit Sharma: టీమ్​ఇండియాకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్​గా ఉండటం గొప్పగా ఉందని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. దానిని గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పాడు. పనిభారంపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు హిట్​మ్యాన్.

Rohit Sharma
India vs Sri Lanka
author img

By

Published : Feb 23, 2022, 3:24 PM IST

Rohit Sharma: అన్ని ఫార్మాట్లలో భారత జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప అనుభూతినిస్తోందని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. శ్రీలంక పర్యటన నేపథ్యంలో గతవారం టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు కూడా అందుకున్నాడు రోహిత్. ఈ క్రమంలో బుధవారం వర్చువల్​గా జరిగిన ప్రెస్​ కాన్ఫరెన్స్​లో మాట్లాడాడు.

"మూడు ఫార్మాట్లలోనూ టీమ్​ఇండియాకు కెప్టెన్సీ చేయడం.. నాకు దక్కిన గొప్ప గౌరవం. అది చాలా మంచి అనుభూతినిస్తోంది. ఈ అవకాశం గురించి తెలిసినప్పుడు ఎంతో సంతోషించా. ఈ ప్రయాణంలో అనేక సవాళ్లున్నాయి. అయితే మా వద్ద అత్యుత్తమ ప్లేయర్లు ఉన్నారు. రాబోయే మ్యాచ్​ల కోసం సిద్ధంగా ఉన్నాం"

-రోహిత్ శర్మ, టీమ్​ఇండియా కెప్టెన్

'పని.. భారమేమీ కాదు'

"జట్టును ముందుకు నడిపించడంపై స్పష్టమైన అవగాహనతో ఉన్నా. పనిభారాన్ని నిర్వహించడం నాకే కాదు, అందరికీ కీలకం. నా వరకైతే ఎలాంటి ఆందోళన లేదు. అన్ని మ్యాచ్​లూ ఆడటానికి సిద్ధంగా ఉన్నా. ఏరోజుకు ఆరోజు ఆలోచిస్తే భారమనిపించదు. అవకాశం ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకుంటాం." అని చెప్పాడు హిట్​మ్యాన్.

లంకతో స్వదేశంలో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది టీమ్​ఇండియా. ఫిబ్రవరి 24, 26, 27వ తేదీల్లో టీ20లు.. మార్చి 4-8 వరకు తొలి టెస్టు, మార్చి 12-16 వరకు రెండో టెస్టు మ్యాచ్‌ జరగనుంది.

ఇదీ చూడండి: 'కోహ్లీ.. సూపర్​హ్యూమన్​- ధోనీలో మంచు ప్రవహిస్తుంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.