ETV Bharat / sports

బీసీసీఐ అధ్యక్ష పదవికి దాదా రాజీనామా.. నిజమేనా?

BCCI Ganguly Resign: బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీ రాజీనామా చేశారా? అంటే సోషల్​మీడియాలో అవుననే సమాధానం కనిపిస్తోంది. మరి ఇందులో నిజమెంత?

Ganguly resign as BCCI President
బీసీసీఐ అధ్యక్ష పదవికి దాదా రాజీనామా
author img

By

Published : Aug 11, 2022, 3:01 PM IST

BCCI Ganguly Resign: సోషల్​మీడియాలో చాలా సార్లు అసత్య ప్రచారాలు చేయడం చూస్తూనే ఉంటాం. రీసెంట్​గా కామన్వెల్త్​తో 100 మీటర్ల స్ప్రింట్​లో భారత అథ్లెట్​ హిమదాస్​ స్వర్ణం దక్కించుకుందంటూ ఫేక్​ న్యూస్​ వైరల్​ అయింది. అయితే తాజాగా ఇప్పుడు మరోసారి అలాంటి అబద్ధపు ప్రచారం జోరుగా సాగింది. అదేంటంటే బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ రాజీనామా చేశారని, అతని స్థానంలో ప్రస్తుత కార్యదర్శి జైషా కొత్త అధ్యక్షునిగా ఎన్నికవ్వనున్నారంటూ కొందరు ఆకతాయిలు పోస్ట్​ వైరల్​ చేస్తున్నారు. అది కూడా బీసీసీఐ పేరుతో ఉన్న ఫేక్​ అకౌంట్​తో. ఇది చూసిన క్రికెట్​ అభిమానులు నిజమనుకుని దాన్ని మరింత వైరల్​ చేస్తున్నారు. కానీ వాస్తవానికి బీసీసీఐ అధికారిక ట్విటర్‌ నుంచి గంగూలీ రాజీనామా చేస్తున్నట్లు ఎక్కడా ప్రకటించలేదు. దీంతో గంగూలీ రాజీనామా అనేది ఫేక్‌ అని తేలిపోయింది.

కాగా, విరాట్ కోహ్లీని వన్డే ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ సెలక్టర్లు సంచలన నిర్ణయం తీసుకున్న విషయంలోనూ పరోక్షంగా దాదా హస్తం ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. విభేదాల కారణంగా గంగూలీ.. కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించారని సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేశాయి.

మరోవైపు త్వరలోనే ప్రస్తుత ఐసీసీ ఛైర్మెన్‌గా ఉన్న గ్రెగ్ బార్‌క్లే త్వరలోే ఆ పదవి నుంచి తప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న దాదా.. ఐసీసీ చైర్మన్‌ పదవిని చేపట్టబోతున్నట్లు కొంతకాలం నుంచి ప్రచారం జరుగుతోంది. ఒకవేల నిజంగానే గంగూలీ ఐసీసీ ఛైర్మెన్‌గా బాధ్యతలు తీసుకోవాలంటే.. ఓకే సమయంలో రెండు పదవుల్లో ఉండడం సమజసం కాదు గనుక బీసీసీఐ అధ్యక్ష పదవికి అతడు రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీన్ని ఆధారంగా చేసుకుని దాదా వ్యక్తిగత కారణాలతో బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పుకుంటున్నాడని.. బీసీసీఐ సెక్రటరీగా ఉన్న జై షా... అధ్యక్ష బాధ్యతలు తీసుకోబోతున్నట్టు కొంతమంది న్యూస్‌ క్రియేట్‌ చేశారంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.

ఇదీ చూడండి: కామన్వెల్త్​లో మిస్సింగ్ కలకలం.. మొన్న 10 మంది.. ఇప్పుడు మరో ఇద్దరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.