భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మాజీ సెలెక్టర్ కిషన్ రుంగ్తా(88) కరోనా బారిన పడి మరణించారు. గతవారం ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలగా.. జైపుర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. కిషన్.. 1988లో టీమ్ఇండియా సెలెక్టర్‌గా వ్యవహరించారు. రాజస్థాన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ.. 1953 నుంచి 1970 మధ్యలో 59 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడారు.
ఇదీ చదవండి: పంజాబ్‌పై దిల్లీ విజయం- పాయింట్ల పట్టికలో అగ్రస్థానం
మరోవైపు ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత, దిగ్గజ ఈక్వెస్ట్రియన్ రిటైర్డ్ కల్నల్ గులామ్ మహమ్మద్ ఖాన్ (74) కూడా మరణించారు. 1980, 90ల్లో ఆయన అగ్రశ్రేణి ఈక్వెస్ట్రియన్‌గా గుర్తింపు పొందారు. దిల్లీలో జరిగిన 1982 ఆసియా క్రీడల్లో టీమ్ ఈవెంటింగ్‌లో పసిడి గెలిచిన జట్టులో ఆయన సభ్యుడు. వ్యక్తిగత రేసులో ఆయన రజతం నెగ్గారు. ఆయన కెప్టెన్సీలోని ఏఎస్సీ జట్టు ఆరు సార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. వ్యక్తిగతంగా ఆయన నాలుగు సార్లు ఆ ఘనత అందుకున్నారు.
ఇదీ చదవండి: ఐపీఎల్: కోహ్లీసేనను కోల్‌కతా అడ్డుకోగలదా?