ETV Bharat / sports

'నేనే విరాట్ అయితే.. కెప్టెన్సీ వదిలేస్తా' - విరాట్ కోహ్లీ

భారత్​, ఇంగ్లాండ్​ టెస్టు సిరీస్​లో సారథి విరాట్​ కోహ్లీ పరుగులు తీయడంలో తడబడుతున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీపై కామెంట్ చేశాడు వ్యాఖ్యాత డబ్ల్యూ వీ రామన్. తానే విరాట్​ అయితే.. కెప్టెన్సీ నుంచి తప్పుకునేవాడినని తెలిపాడు.

raman
రామన్
author img

By

Published : Aug 31, 2021, 5:31 AM IST

భారత్​, ఇంగ్లాండ్​ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్​లో ఫామ్​లోకి రావడానికి విరాట్​ తెగ ప్రయత్నిస్తున్నాడని అన్నాడు మాజీ టెస్టు క్రికెటర్, వ్యాఖ్యాత డబ్ల్యూ వీ రామన్. సారథిలా ముందుండి నడపడం కన్నా.. ఇతర ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తూ వారిలోని ప్రతిభను కోహ్లీ గుర్తిస్తే బాగుంటుందని ఓ స్పోర్ట్స్​ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

"ఒకవేళ నేను విరాట్​ కోచ్​ అయితే.. సారథిగా ముందుండి నడిపించడం మాని.. ఇతర ఆటగాళ్లకు మద్దతుగా నిలవమని కోహ్లీకి చెప్పేవాడిని. అతడికి ఈ విషయం త్వరలోనే అర్థమవుతుంది."

-డబ్ల్యూ వీ రామన్, వ్యాఖ్యాత.

రానున్న రెండు టెస్టు​ మ్యాచుల్లో కోహ్లీ ఉత్తమంగా ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు రామన్. కోహ్లీపై ఒత్తిడి తీవ్రంగా ఉందని అన్నాడు. కోహ్లీ ఓ ఉత్తమ బ్యాట్స్​మన్ కనుక అందరూ అతడి నుంచి మంచి ప్రదర్శన ఆశిస్తారని పేర్కొన్నాడు.

ఇదీ చదవండి:'పీసీబీ ఛైర్మన్​ పోటీలో వసీమ్ అక్రమ్.. కానీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.