ETV Bharat / sports

'ఒక్కరిని స్లెడ్జ్​ చేసినా మేమంతా కలిసి బుద్ధి చెబుతాం!' - విరాట్​ కోహ్లీ తాజా

క్రికెట్​ పుట్టినిల్లు లార్డ్స్​లో జరిగిన మ్యాచ్​ గెలుపొందడం చాలా ప్రత్యేకమైనదని అన్నాడు టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ. రెండో టెస్టు తమ జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేసిన కోహ్లీ.. జట్టును చూసి గర్వపడుతున్నాని మ్యాచ్​ అనంతరం జరిగిన కార్యక్రమంలో వెల్లడించాడు.

virat kohli on lords test
'వాళ్లను రెచ్చగొట్టడమే మంచిదైంది'
author img

By

Published : Aug 17, 2021, 9:37 AM IST

Updated : Aug 17, 2021, 10:54 AM IST

ఇంగ్లాండ్​ ఆటగాళ్లతో జరిగిన వాగ్వాదం.. బౌలర్లు షమీ, బూమ్రాలకు భారత్​ను విజయతీరాలకు చేర్చేలా ప్రేరేపించిందని టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ అన్నాడు. రెండో ఇన్నింగ్స్​లో జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. రెండో టెస్టు అనంతరం జరిగిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

ధోనీ కెప్టెన్సీలో విజయం ఉన్నా..

'2014 ఎంఎస్​ ధోనీ సారథ్యంలో లార్డ్స్​లో భారత్​ గెలుపు కన్నా.. ఈ విజయం మాకెంతో ప్రత్యేకమైనది. 60 ఓవర్లలో మ్యాచ్​ ఫలితం రాబట్టాలనే లక్ష్యం పెట్టుకోవడమే అందుకు కారణం. జట్టును చూసి గర్వపడుతున్నా."

- విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా కెప్టెన్​

వాగ్వాదాలను పట్టించుకోము..

ఆట మధ్యలో ప్రత్యర్థులు కవ్వింపులకు పాల్పడటం, వాగ్వాదాలు వంటివి జరిగినా అవి తాము పట్టించుకోమని అన్నాడు టీమ్ఇండియా ఓపెనర్​ కేఎల్​ రాహుల్​. ప్రత్యర్థి.. తన జట్టు సభ్యుల్లో ఎవరినైనా స్లెడ్జ్​​ చేస్తే అందరం కలిసి బుద్ధి చెప్తామని రాహుల్​ తెలిపాడు.

లార్డ్స్​ ఆనర్స్​ బోర్డులో తన పేరు శాశ్వతంగా ఉందో లేదో అని ప్రతిరోజు బోర్డును చూసుకునేవాడినని.. కానీ ఆ పేరును ఇంకా తాత్కాలికంగానే ఉందని చెప్పుకొచ్చాడు. తొలి ఇన్నింగ్స్​లో సెంచరీతో మెరిసిన ఈ సొగసరి బ్యాట్స్​మన్​​ 'మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​'గా నిలిచాడు.

ఇదీ చదవండి : ఒలింపిక్స్​ అథ్లెట్లతో ప్రధాని మోదీ ఆత్మీయ సమ్మేళనం

Last Updated : Aug 17, 2021, 10:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.