ETV Bharat / sports

IND Vs ENG: భారత్ తడబాటు.. టీ విరామానికి 122/6 - IND Vs ENG

నాలుగో టెస్టులో కోహ్లీ సేన ధాటిగా ఆడలేకపోతుంది. టీ బ్రేక్​ సమయానికి 122/6తో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో పంత్, శార్దుల్ ఠాకుర్ ఉన్నారు. కెప్టెన్ కోహ్లీ హాఫ్ సెంచరీతో మెరిశాడు.

IND Vs ENG 4th Test First Day 2nd Session Completed
IND Vs ENG: రెండో సెషన్‌లోనూ ఇంగ్లాండ్‌దే ఆధిపత్యం
author img

By

Published : Sep 2, 2021, 8:19 PM IST

ఇంగ్లాండ్​తో నాలుగో టెస్టులో(IND Vs ENG) టీమ్ఇండియా తడబడుతోంది. తొలిరోజు రెండో సెషన్​ ముగిసి, టీ విరామ సమయానికి 6 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. కెప్టెన్​ విరాట్​ కోహ్లీ(50) అర్థశతకంతో అలరించగా.. అంతకుముందు రవీంద్ర జడేజా(10) పేలవ ప్రదర్శనతో వెనుదిరిగాడు. ప్రస్తుతం శార్దుల్ ఠాకుర్(4), రిషబ్​ పంత్​(4) ఉన్నారు. ఇంగ్లాండ్​ బౌలర్లు ఓలీ రాబిన్సన్​, క్రిస్​ వోక్స్​ చెరో రెండు వికెట్లు సాధించగా.. జేమ్స్​ అండర్సన్​, పోప్ తలో వికెట్​ పడగొట్టారు.

అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన టీమ్ఇండియా తొలి సెషన్​లో మూడు వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ పేసర్లు అండర్సన్‌, రాబిన్‌సన్‌, క్రిస్‌వోక్స్‌ చెలరేగడం వల్ల ఆతిథ్య జట్టు ఆధిపత్యం చెలాయించింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ(11), రాహుల్‌(17)తో పాటు వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ చెతేశ్వర్‌ పుజారా(4) విఫలమయ్యాడు. తొలుత వోక్స్‌ రోహిత్‌ను ఔట్‌చేసి ఇంగ్లాండ్‌కు శుభారంభం అందించగా కాసేపటికే రాహుల్‌, పుజారాలను.. రాబిన్‌సన్‌, అండర్సన్‌ పెవిలియన్‌ పంపారు. దాంతో భారత్‌ 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే, కోహ్లీ తర్వాత రహానె రాకుండా జడేజా క్రీజులోకి రావడం గమనార్హం.

కోహ్లీ @ 23,000

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 23,000 పరుగుల మైలురాయి పూర్తి చేసుకున్నాడు. అతితక్కువ 490 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించిన బ్యాట్స్‌మెన్‌గా కొత్త రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ పేరిట ఈ రికార్డు ఉండేది.

అప్పట్లో సచిన్‌ 522 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించగా తర్వాత ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్‌ 544 మ్యాచ్‌ల్లో ఈ మైలురాయి చేరుకున్నాడు. ఇక దక్షిణాఫ్రికా ఆల్‌టౌమ్‌ ఆల్‌రౌండర్‌ జాక్వెస్‌ కలిస్‌ 551 మ్యాచ్‌ల్లో, శ్రీలంక మాజీ బ్యాట్స్‌మన్‌ కుమార సంగక్కర 568, రాహుల్‌ ద్రవిడ్‌ 576, మహేలా జయవర్దెనె 645 మ్యాచ్‌ల్లో తర్వాతి స్థానాల్లో నిలిచారు.

ఇదీ చూడండి.. IND Vs ENG: లంచ్​ విరామానికి టీమ్​ఇండియా 54/3

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.