టీమ్ఇండియా శిబిరంలో కరోనా కేసులు(Corona Cases in Indian Team) కలవరపెడుతున్న వేళ.. ఇంగ్లాండ్‌తో ఆఖరి టెస్టుపై సందేహాలు తలెత్తుతున్నాయి. జట్టు జూనియర్ ఫిజియో యోగేశ్ పరామర్కు గురువారం కరోనా సోకినట్లు తేలడమే ఇందుకు కారణం. ఇదే విషయమై భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పందించాడు.
"టీమ్ఇండియా శిబిరంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఆఖరి టెస్టు జరుగుతుందా? లేదో కూడా చెప్పలేం" అని గంగూలీ ఓ ప్రకటనలో తెలిపారు.
ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు జరుగుతున్నప్పుడే కోచ్‌ల బృందంలో కరోనా కేసులు వచ్చాయి. అయినా ఆటగాళ్లకు కరోనా నెగెటివ్‌గా తేలడం వల్ల మ్యాచ్‌ను కొనసాగించారు. అయితే జట్టులోని స్టార్ ఆటగాళ్లు అయిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, రిషబ్ పంత్‌లలో ఎవరికైనా ఒకవేళ వైరస్ సోకితే బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో?
స్టార్ ఆటగాళ్లకు కరోనా సోకితే..
కోహ్లీ, రోహిత్ శర్మ, పంత్ వంటి ఐపీఎల్ కెప్టెన్లకు కరోనా సోకితే మాత్రం.. సెప్టెంబరు 19 నుంచి జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ ప్రభావం టీ20 ప్రపంచకప్‌లో(ICC T20 World Cup) పాల్గొనే భారత జట్టుపై పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆఖరి టెస్టు జరుగుతుందా? లేదా? అనే దానిపై సర్వత్రా చర్చ నడుస్తుంది.
ఐదుకు చేరిన కేసులు
టీమ్ఇండియా కోచ్ బృందంలోని ప్రధానకోచ్ రవిశాస్త్రి(Ravi Shastri Corona), బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్, ఫిజియో నితిన్ పటేల్ ఇటీవలే కరోనా బారిన పడి ఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రస్తుతం జూనియర్ ఫిజియో యోగేశ్ పరామర్కు పాజిటివ్ వచ్చింది. దీంతో భారత బృందంలో కరోనా కేసుల సంఖ్య 5కు పెరిగింది.
ఇదీ చూడండి.. IND Vs ENG Preview: నిర్ణయాత్మక పోరులో గెలిచేది ఎవరు?