ETV Bharat / sports

ద్రవిడ్​ ఎన్​సీఏలో కోచ్​లకు 'కొత్త పాఠాలు' - ఎన్​సీఏలో ద్రవిడ్ శిక్షణ

రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని ఎన్​సీఏలో వినూత్న శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఫీల్డ్​ బయట సమస్యలను ఎదుర్కోవడం సహా క్లిష్ట సమయాల్లో భిన్న వర్గాలతో ఎలా వ్యవహరించాలి అనే విషయాలపై ఆశావహ కోచ్​లకు శిక్షణ ఇస్తున్నారు.

రాహుల్ ద్రవిడ్
Rahul Dravid
author img

By

Published : Aug 23, 2021, 5:33 AM IST

రాహుల్ ద్రవిడ్ సారథ్యంలోని జాతీయ క్రికెట్ అకాడమీలో కోచ్​ ఆశావహులకు సరికొత్త 'కార్పొరేట్ శిక్షణ' తరగతులు జరుగుతున్నాయి. సెలక్షన్​ ప్రక్రియలో ఒత్తిడి సహా ఫీల్డ్​ వెలువల సమస్యలను ఎలా ఎదుర్కోవాలి? అనే అంశాలతో కోచించ్ మ్యానువల్​ను తీర్చిదిద్దారు. ఇందుకు సంబంధించి ప్రముఖ మాజీ ఫస్ట్​ క్లాస్ క్రికెటర్లు.. బీసీసీఐ లెవెల్ 2 కోర్సు పూర్తి చేసుకొని పరీక్షలకు కూడా హాజరయ్యారు.

ఏమిటీ కార్పొరేట్ శిక్షణ..

ఈ కోర్సును ఎంబీఏ చేసిన ముంబయి మాజీ సీమర్ క్షేమల్ వైంగన్కర్ రూపొందించారు. ఫీల్డ్ బయట ఉండే స్టేక్​హోల్డర్​లతో ఎలా వ్యవహరించాలి అనే అంశాన్ని కోర్సులో కొత్తగా చేర్చారు. దీనిద్వారా తన అవగాహన పరిధి పెరిగిందని ఓ ఫస్ట్​ క్లాస్ క్రికెటర్ తెలిపారు.

ఈ కోర్సు గురించి వివరిస్తూ.. "బేరానికి, చర్చకు మధ్య తేడా వివరించడమే శిక్షణ ముఖ్య ఉద్దేశం. సమస్యను పరిష్కరించాల్సిన అవసరం లేదని, క్లిష్ట పరిస్థితుల్లో అనుసరించే పరిష్కార పద్ధతులే ప్రధానమని చెప్పారు. కోచ్​, సెలక్టర్ బాధ్యతల్లో ఉన్నప్పుడు పై అధికారులు, అసిస్టెంట్​లు, కెప్టెన్​ను భిన్న అంశాలపై ఎలా ఒప్పించాలి? లాంటివి నేర్పుతారు," అని ఆ క్రికెటర్ వెల్లడించారు.

ద్రవిడ్​ కోచింగ్​ ఇస్తారా?

ఎన్​సీఏ అధ్యక్షుడు ద్రవిడ్​.. ఈ తరగతులను తీసుకోవడం లేదు. అయితే స్వయంగా ఆయనే ఓ విద్యార్థిలాగా వీటికి హాజరవుతుండటం ఓ విశేషం. శిక్షణ తీసుకునేవారితో పాటు ద్రవిడ్ కూడా సమస్యలకు పరిష్కారాలను ఆలోచిస్తారట. "ద్రవిడ్​ తనను తాను విద్యార్థిలానే భావిస్తారు, నేర్చుకోవడం ఆపిన మరుక్షణం ఇక ముగింపని చెబుతారు," అని మరో క్రికెటర్​ తెలిపారు.

ఇదీ చూడండి: కోచ్​ పదవికి రవిశాస్త్రి గుడ్​బై!.. ద్రవిడ్​పైనే అందరి దృష్టి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.