ETV Bharat / sports

ధోనీ పేరుతో మోసం..! భారీ మొత్తంలో డబ్బులు కాజేసిన కేటుగాళ్లు - పట్నాలో ధోనీ పేరుతో మోసం

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ ధోనీ ఫొటోను ఉపయోగించి కొంతమంది సైబర్​ నేరగాళ్లు మోసాలకు పాల్పడ్డారు. ఈ ఘటన బిహార్​లోని పట్నాలో జరిగింది.

cheating case in Patna
ధోనీ
author img

By

Published : Dec 20, 2022, 12:13 PM IST

టీమ్ ​ఇండియా మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీ పేరుతో కొంతమంది దుండగులు సైబర్​ నేరాలకు పాల్పడ్డారు. ఈ ఘటన బిహార్​లోని పట్నాలో జరిగింది. ఈ కేసులో మొత్తం ఐదుగురుని పోలీసులు అరెస్టు చేశారు. మొదట గౌతమ్, భరత్ అనే ఇద్దరు నిందితులని అరెస్టు చేసిన పోలీసులు.. విచారణ అనంతరం మరో ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మొబైల్‌ ఫోన్‌, ల్యాప్‌టాప్‌తో పాటు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం..
పట్నాకు చెందిన కొంతమంది ముఠా.. ఆన్​లైన్​లో ఓ నకిలీ ఫైనాన్స్​ కంపెనీని సృష్టించి తక్కువ వడ్డీకే లోన్స్​ ఇస్తామంటూ ఆశా చూపి మోసాలకు పాల్పడ్డారు. తమ కంపెనీకి మహీ బ్రాండ్ అంబాసిడర్​గా ఉన్నట్లు ప్రచారం చేస్తూ ప్రజల్ని నమ్మించారు. సులభ రుణాలు ఇస్తున్నామని చెప్పి.. ప్రాసెసింగ్ ఫీజు, ఇన్సూరెన్స్, జీఎస్టీ తదితర పేర్లతో డబ్బు ముందుగా డబ్బులు తీసుకుని.. ఆ తర్వాత సిమ్ కార్డులు మార్చి ప్రజలను మోసం చేశారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అధికారులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్​ చేశారు.
ఇవీ చదవండి:

బీసీసీఐ అపెక్స్​ కౌన్సిల్​ మీటింగ్​ ఫిక్స్​.. టీ20 ఫార్మాట్​కు కొత్త కెప్టెన్​?

రిటైర్మెంట్ ఇప్పట్లో లేదు.. ఇంకొన్నాళ్లు ఆడుతా: మెస్సీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.