Dinesh Karthik Bowling : ఆసియాకప్‌ను విజయంతో ముగించింది టీమ్ ఇండియా. దుబాయ్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత్ 102 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. ఈ నామమాత్రపు మ్యాచ్‌లో కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 61 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 122 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లతో విజృంభించడం వల్ల మ్యాచ్ ఏకపక్షం అయిపోయింది.
ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా బ్యాటర్ దినేశ్ కార్తీక్ బౌలింగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. కార్తీక్.. తన 18 ఏళ్ల కెరీర్‌లో బౌలింగ్ చేయడం ఇదే తొలిసారి. అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్ వేసిన కార్తీక్ ఏకంగా 18 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే కార్తీక్ బౌలింగ్ సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
-
India vs Afghanistan #AsiaCup2022 #DineshKarthik bowling pic.twitter.com/PEo8lxmuaw
— Deepak Dagar (@deepak123dagar) September 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">India vs Afghanistan #AsiaCup2022 #DineshKarthik bowling pic.twitter.com/PEo8lxmuaw
— Deepak Dagar (@deepak123dagar) September 8, 2022India vs Afghanistan #AsiaCup2022 #DineshKarthik bowling pic.twitter.com/PEo8lxmuaw
— Deepak Dagar (@deepak123dagar) September 8, 2022
ఇవీ చదవండి: విరాట్ సెంచరీతో అనుష్క ఫుల్ ఖుష్.. ఇన్‌స్టాలో లవ్ నోట్
మూడేళ్ల నిరీక్షణకు తెర.. విరాట్ కెరీర్‌లో 71వ శతకం.. ఫ్యాన్స్ సెలబ్రేషన్స్