Dhoni Mohammad Shahzad : తన కెప్టెన్సీతో పాటు ఫ్రెండ్రీనెస్తో కొన్ని కోట్లాది మంది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్నాడు. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ఈ పేరు వింటే ఎంతో మంది అతడి కెప్టెన్సీ గురించి మాట్లాడుకుంటారు. ప్లేయర్లకు దిశా నిర్దేశం చేసే ఓ మంచి వ్యక్తి అంటూ ధోనీని కొనియాడుతుంటారు. దీంతో తనతో జర్నీ చేసిన ప్రతి ఒక్కరూ మిస్టర్ కూల్ గురించి ఏదో ఒక ఆసక్తికరమైన విషయం చెప్తుంటారు. ఈ నేపథ్యంలో అఫ్గానిస్థాన్ మాజీ కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ తనకు, ధోనీకి మధ్య జరిగిన ఓ సరదా సంభాషణ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
"2018 ఆసియా కప్‌లో భాగంగా జరిగిన భారత్ వర్సెస్ అఫ్గానిస్థాన్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే ఆ తర్వాత ధోనీ, నేను కాసేపు ముచ్చటించాం. ధోని ఓ గొప్ప కెప్టెన్. భారత క్రికెట్‌కు అతడు దేవుడిచ్చిన ఓ బహుమతి. తనతో మాట్లాడుతున్న సమయంలో నేను మా టీమ్ మెంబర్ ముహమ్మద్ షహ్జాద్ గురించి కూడా చెప్పాను. షహ్జాద్ మీకు చాలా పెద్ద ఫ్యాన్ అంటూ నేను చెప్పాను. అయితే, షహ్జాద్‌ది భారీ కాయమని, అతడు ఓ 20 కేజీల బరువు తగ్గితే తాను అతడ్ని ఐపీఎల్ జట్టులోకి తీసుకుంటానంటూ ధోని సరదాగా అన్నాడు. అయితే సిరీస్ తర్వాత షహ్జాద్ మరో ఐదు కేజీల బరువు పెరిగాడు" అని అస్గర్ నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు.
2015 నుంచి 2021 వరకు అఫ్గానిస్థాన్ జట్టుకు మహ్మద్ అస్గర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతడు అఫ్గానిస్థాన్ తరఫున ఆరు టెస్టులు, 114 వన్డేలు, 75 టీ20లు ఆడాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ జట్టు మంచి ప్రదర్శన చేసిందని అస్గర్ అన్నాడు. 2015లో తాను కెప్టెన్‌గా ఉన్న సమయంలో తమ జట్టు పునర్నిర్మాణ దశలో ఉందని.. ఇప్పుడు తమ జట్టు గొప్ప ప్రదర్శన చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నాడు. అంతే కాకుండా అఫ్గానిస్థాన్ క్రికెట్ అభివృద్ధిలో బీసీసీఐ కీలక పాత్ర పోషిందని అస్గర్ వెల్లడించాడు. తమకు ఇప్పటికీ బీసీసీఐ నుంచి మంచి సహకారం అందుతోందని అన్నాడు. తమ క్రికెటర్లు రాటు దేలడానికి ఐపీఎల్ ఎంతో ఉపయోగపడుతుందని రషీద్ ఖాన్ లాంటి స్టార్లు ఐపీఎల్ కారణంగానే వెలుగులోకి వచ్చారంటూ మహ్మద్ అస్గర్ పేర్కొన్నాడు. భారత్ తరహాలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ కూడా అఫ్గానిస్థాన్ క్రికెట్‌కు మద్దతు ఇవ్వాలని కోరాడు.
-
Asghar Afghan recalls a hilarious MS Dhoni tale from the 2018 Asia Cup tied match. 😂#MSDhoni #AsgharAfghan #Afghanistan #Cricket #Sportskeeda pic.twitter.com/OrMKrzqonp
— Sportskeeda (@Sportskeeda) December 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Asghar Afghan recalls a hilarious MS Dhoni tale from the 2018 Asia Cup tied match. 😂#MSDhoni #AsgharAfghan #Afghanistan #Cricket #Sportskeeda pic.twitter.com/OrMKrzqonp
— Sportskeeda (@Sportskeeda) December 8, 2023Asghar Afghan recalls a hilarious MS Dhoni tale from the 2018 Asia Cup tied match. 😂#MSDhoni #AsgharAfghan #Afghanistan #Cricket #Sportskeeda pic.twitter.com/OrMKrzqonp
— Sportskeeda (@Sportskeeda) December 8, 2023
నితిన్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన స్టార్ క్రికెటర్ - ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటే ఇదేనేమో!
ధోనీ చెప్పిన ఆ ఒక్క మాటే నేను వన్డేల్లో రాణించడానికి కారణం! : వెస్టిండీస్ కెప్టెన్