Dhoni Ayodhya Ram Mandir : అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ కోసం సర్వం సిద్ధమవుతోంది. జనవరి 22న జరగనున్న ఈ ప్రతిష్టాత్మక వేడుక కోసం ఇప్పటికే దేశ నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కావాలంటూ ట్రస్టు సభ్యులు ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు అందించారు. తాజాగా టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఈ ఆహ్వాన పత్రిక అందింది. ఆర్‌ఎస్‌ఎస్ కో ప్రోవిన్స్ సెక్రటరీ ధనంజయ్ సింగ్ స్వయంగా ధోనీని ఆయన నివాసంలో కలిసి ఈ వేడుకకు ఆహ్వానించారు. దానికి సంబంధించిన పత్రికను అందించారు. మరోవైపు దిగ్గజ సింగర్ ఆశా భోస్లేకి కూడా ఈ వేడుకకు హాజరయ్యేందుకు ఆహ్వానం అందింది. ట్రస్ట్ నిర్వాహకులు ఆమెను కలిసి ఆశాను సాదరంగా ఆహ్వానించారు. ఇక ఆమెతో పాటు దివంగత గాయని లత మంగేష్కర్ సోదరి ఉష మంగేష్కర్‌కు ఆహ్వానం అందింది.
-
MS Dhoni got the invitation for the Ram Temple Pran Pratishtha at Ayodhya. pic.twitter.com/loV8rklpxF
— Johns. (@CricCrazyJohns) January 15, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">MS Dhoni got the invitation for the Ram Temple Pran Pratishtha at Ayodhya. pic.twitter.com/loV8rklpxF
— Johns. (@CricCrazyJohns) January 15, 2024MS Dhoni got the invitation for the Ram Temple Pran Pratishtha at Ayodhya. pic.twitter.com/loV8rklpxF
— Johns. (@CricCrazyJohns) January 15, 2024
ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 10 వేల మందికి పైగా ప్రముఖులకు రామ జన్మ భూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు ఈ వేడుకకు హాజరయ్యేందుకు ఆహ్వానాలు అందించింది. మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్, విరాట్ కోహ్లీ, హర్భజన్ సింగ్‌లకు కూడా అయోధ్య రాముని ఆహ్వానం అందింది. ఇక టాలీవుడ్‌కు చెందిన పలువురు అగ్ర హీరోలకు కూడా ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. అందులో మెగా స్టార్ చిరంజీవితో పాటు అతని తనయుడు రామ్ చరణ్, ప్రభాస్, మోహన్ బాబు, అక్కినేని నాగర్జున వంటి పలువురు స్టార్స్ ఉన్నారు.
Shri Ram Vigraha Prana Pratishtha And Related Events : అయోధ్య రామమందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. హిందూ సంప్రదాయాలు, ఆచారాల ప్రకారం ఈ క్రతువులను నిర్వహించనున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం మంగళవారం పరిహార క్రతువును నిర్వహించనుంది. అలాగే సరయూ నది ఒడ్డున దశవిధ స్నానం, విష్ణుపూజ, గో సమర్పణ మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ జనవరి 18న శ్రీరాముని విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చనున్నారు. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12.20 గంటలకు వచ్చే అభిజిత్ ముహూర్తాన విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేస్తారు. వారణాసికి చెందిన గణేశ్వర శాస్త్రి ద్రవిడ్ ఈ ముహూర్తాన్ని నిర్ణయించారు.
ప్రతి టికెట్‌పై రూ.5- అయోధ్య రామయ్యకు 'హనుమాన్' విరాళం: చిరంజీవి
అయోధ్యలో స్థలం కొన్న అమితాబ్- 10వేల చదరపు అడుగులు ఎన్ని కోట్లంటే?