David Warner Farewell : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు ఆసీస్ నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి ఫ్యాన్స్ ఉన్నారు. అయితే తాజాగా ఆయన సొంత మైదానంలో తన ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడాడు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టుక సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆయన తన ఇన్నింగ్స్‌ను ముగించాడు.
ఈ నేపథ్యంలో పెవిలియన్ వెళ్తున్న సమయంలో ఈ స్టార్ క్రికెటర్ భావోద్వేగానికి లోనయ్యాడు. బ్యాట్ చూపిస్తూ స్టేడియంలోని అభిమానులకు అభివాదం చేశాడు. ఇది చూసి స్టాండ్స్‌లో కూర్చున్న ఫ్యాన్స్ లేచి నిల్చొని చప్పట్లు కొడుతూ వార్నర్‌ను అభినందించారు. మరోవైపు డ్రెసింగ్ రూమ్‌కు వెళ్తున్న సమయంలో డేవిడ్ వార్నర్ తన బ్యాటింగ్ గ్లౌజ్‌లను ఓ అభిమానికి ఇచ్చాడు. దీంతో ఆ ఫ్యాన్ ఎంతో ఆనందించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. దీన్ని చూసిన క్రికెట్ లవర్స్ ఆయన మంచి మనసును కొనియాడుతున్నారు.
-
At the ground where he scored 912 Test runs, and made his T20I debut all those years, David Warner bids farewell to the MCG for one final time #AUSvPAK pic.twitter.com/0XQ6O74meH
— cricket.com.au (@cricketcomau) December 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">At the ground where he scored 912 Test runs, and made his T20I debut all those years, David Warner bids farewell to the MCG for one final time #AUSvPAK pic.twitter.com/0XQ6O74meH
— cricket.com.au (@cricketcomau) December 28, 2023At the ground where he scored 912 Test runs, and made his T20I debut all those years, David Warner bids farewell to the MCG for one final time #AUSvPAK pic.twitter.com/0XQ6O74meH
— cricket.com.au (@cricketcomau) December 28, 2023
Pakistan Vs Australia Test : పెర్త్ వేదికగా జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఆసీస్ జట్టు సూపర్ ఫామ్‌లో ఉంది. ఇక మూడో రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు కోల్పోయి 187 పరుగులు సాధించింది. అలా 241 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.16 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆ జట్టును మిచెల్ మార్ష్ (96), స్టీవ్ స్మిత్ (50) తమ ఆట తీరుతో ఆదుకున్నారు. వీరిద్దరు అయిదో వికెట్‌కు 153 పరుగులు జోడించి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇక పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, హంజా చెరో మూడు వికెట్లు తీశారు.
David Warner Career : ఇక వార్నర్ కెరీర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో అతడు 38 పరుగులు చేశాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఆరు పరుగులే చేశాడు. జనవరి 3న సిడ్నీ వేదికగా జరగనున్న ఆసీస్-పాక్ మూడో టెస్టు తర్వాత వార్నర్ ఈ సుదీర్ఘ ఫార్మాట్ కెరీర్‌ను ముగించనున్నాడు.
'ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి' - మిచెల్ జాన్సన్ వ్యాఖ్యలపై స్పందించిన డేవిడ్ వార్నర్
సోషల్ మీడియాలో వార్నర్‌ను బ్లాక్ చేసిన సన్‌రైజర్స్ - అభిమానుల ఆగ్రహం