ETV Bharat / sports

SPY Movie : హీరోలుగా మహేశ్​-బన్నీ.. రష్మిక హీరోయిన్​.. విలన్​గా వార్నర్! - వార్నర్ డ్రీమ్ కాస్ట్​ రష్మిక

ఒకవేళ సినిమాల్లో నటించాల్సి వస్తే తన డ్రీమ్ కాస్ట్​ ఎవరో చెప్పుకొచ్చాడు క్రికెటర్ వార్నర్. ​మహేశ్​బాబు, అల్లుఅర్జున్​, రష్మికతో కలిసి పనిచేయాలని అందని తెలిపాడు. తాను విలన్​ పాత్ర పోషిస్తానని చెప్పుకొచ్చాడు.

David Warner
SPY Movie : హీరోలుగా మహేశ్​-బన్నీ.. రష్మిక హీరోయిన్​.. విలన్​గా వార్నర్!
author img

By

Published : May 20, 2023, 6:57 PM IST

డేవిడ్ వార్నర్​.. క్రికెట్​ అభిమానులతో పాటు సోషల్​మీడియా ఫాలో అయ్యే ప్రతి తెలుగువాడికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మైదానంలో అడుగుపెట్టాడంటే రెచ్చిపోయే ఈ ఆసీస్‌ బ్యాటర్‌, గతంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా ఐపీఎల్‌ కప్‌ను అందించాడు. అంతేకాకుండా తెలుగు, హిందీ.. ఇలా పలు భారతీయ సినిమాలకు సంబంధించిన పలు సాంగ్స్​ను అనుకరిస్తూ సోషల్‌ మీడియాలో రీల్స్‌తో ఇక్కడి అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. అలాగే హిట్‌ పాటలకు తన కుటుంబంతో కలిసి డ్యాన్సులేస్తూ అందర్నీ ఆకట్టుకున్నాడు. అయితే ప్రస్తుతం ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​ తరఫున ఆడుతున్న అతడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. తాను సినిమాల్లో నటించాల్సి వస్తే.. ఎవరితో కలిసి పనిచేస్తాడో చెప్పాడు.

'ఓ స్పై మూవీ చేయాల్సి వస్తే ఎవరితో కలిసి పనిచేస్తావ్​ .. నీ డ్రీమ్ కాస్ట్​​ ఎవరు' అని ఇంటర్వ్యూయర్​ అడగగా.. మహేశ్ బాబు, అల్లు అర్జున్​, రష్మిక అని సమాధానమిచ్చాడు. ఆ చిత్రంలో తాను ఓ విలన్​ పాత్ర పోషిస్తానని చెప్పుకొచ్చాడు. "నా డ్రీమ్​ కాస్ట్​​ మహేశ్​బాబు, అల్లుఅర్జున్​, రష్మిక. రష్మిక అల్లుఅర్జున్​తో కూడా పనిచేసింది. నేను బ్యాడ్​ గాయ్​గా ఉంటాను. విలన్ పాత్ర పోషిస్తాను. అది నా నేచర్" అని పేర్కొన్నాడు.

అలాగే తాను టిక్​ టాక్​ రీల్స్​ ఎందుకు చేశాడో, ముఖ్యంగా ఇండియన్ సాంగ్స్​ను ఎందుకు అనుకరించాడో కూడా వివరించాడు వార్నర్​. "అసలు టిక్​ టాక్​ అంటే మొదట నాకు తెలీదు. నేను అంతగా పట్టించుకోలేదు. అయితే కొవిడ్ సమయంలో అసలు టిక్​టాక్​లో ఏం జరుగుతుందో అని చూడాలనుకున్నాను. నాకు నచ్చింది. అప్పుడే కొంతమంది ఓ సాంగ్​ నువ్వు కూడా చేయ్​ అని అడిగారు. అప్పుడు నాకు మూడు పాటలే తెలుసు. 'షీలా కీ జవానీ', 'మై తేరా హీరో', 'చమ్మక్​ చల్లో సాంగ్స్'​. మేము 'షీలా కీ జవానీ' చేశాం. అంతే దీంతో మిలయన్స్ రిక్వెస్ట్​లు వచ్చాయి. అలాగే హైదరాబాదీ ఫ్యాన్స్​.. 'బుట్టబొమ్మ' సాంగ్ చేయమన్నారు. అది చేస్తే బ్లాక్​బాస్టర్​ అయింది" అని వార్నర్​ చెప్పుకొచ్చాడు.

కాగా, గతంలో కరోనా సమయంలో క్రికెట్‌ ఆడలేకపోయిన ఈ వార్నర్​.. తన భార్యతో కలిసి చేసిన టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ బాగా ఫేమస్ అయిపోయాడు. ముఖ్యంగా ఇండియాలో తెలుగునాట బాగా పాపులర్​ అయ్యాడు. అల్లు అర్జున్‌ 'అల వైకుంఠపురం'లో 'బుట్టబొమ్మ'.. మహేశ్‌బాబు 'సరిలేరు నీకెవ్వరూ'లో మైండ్‌ బ్లాక్‌ పాటలకు స్టెప్పులేసి తనలోని మరో కొత్త కోణాన్ని బయటకు తీశాడు. ఆ మధ్యలో బన్నీ 'పుష్ప'లోని 'యే బిడ్దా.. ఇది నా అడ్డా..' సాంగ్​ను ఇమిటేట్ చేస్తూ వీడియో చేశాడు. అలా ఎన్నో తెలుగు పాటలకు చిందులేశాడు. ఇక ఐపీఎల్ విషయానికొస్తే.. వార్నర్ కెప్టెన్​గా ప్రాతినిధ్యం వహిస్తున్న దిల్లీ క్యాపిటల్స్​ టీమ్ పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్​ రేసు నుంచి వైదొలిగింది.

ఇదీ చూడండి: IPL 2023 CSK VS DC : అది ధోనీ క్రేజ్​.. బౌలర్లు భయపడాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.