ETV Bharat / sports

సెంచరీల సోగ్గాళ్లు వీళ్లే.. కానీ ఎంతో కాలం ఎదురుచూపుల తర్వాత.. - లుక్​ బ్యాక్​ 2022 క్రికెట్​

క్రికెట్​లో సెంచరీ సాధించడం ప్రతి క్రికెటర్​కు మంచి అనుభూతి. అటు ఫ్యాన్స్​ కూడా ఫుల్​ ఖుషి అవుతారు. కాగా, ఈ ఏడాదిలో కొందరు ఆటగాళ్లు సుదీర్ఘ విరామం తర్వాత అత్యుత్తమమైన ఆట తీరుతో శతకాలు బాదారు. ఈ ఏడాది చివరి అంకానికి వచ్చినందున.. సుదీర్ఘ కాలం విరామం తర్వాత చివరకు మూడు అంకెలను స్కోరును అందుకున్న కొందరు బ్యాటర్ల గురించి తెలుసుకుందాం.

crickters score century in 2022 after long gap

author img

By

Published : Dec 27, 2022, 4:18 PM IST

ఏ క్రికెట్​ మ్యాచ్​లోనైనా ఆటగాడు శతకం చేస్తే.. అందరిలో ప్రత్యేక గుర్తింపు పొందుతాడు. దాంతో పాటు అతడి ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుంది. అయితే, తాను అత్యుత్తమ ప్రదర్శన చేసి సెంచరీ సాధించాలని ప్రతి బ్యాటర్​ అనుకుంటాడు. అలాగే తమ అభిమాన ప్లేయర్​ సెంచరీ కొట్టాలని ఫ్యాన్స్​ కూడా కోరుకుంటారు. కానీ ఆ శతక లక్ష్యాన్ని ఛేదించడం.. అంత సులువేమి కాదు. నిరంతర సాధన చేస్తే తప్ప అలాంటి ఘనతలను సాధించలేము. అయితే ఇప్పటికే పదుల సంఖ్యలో సెంచరీలు చేసిన పలు ఆటగాళ్లు చాలా కాలంగా శతకాలకు దూరంగా ఉన్నారు. అయితే సుదీర్ఘమైన విరామం తర్వాత ఈ ఏడాదిలో కొందరు తమ శతకాల సంఖ్యను పెంచుకున్నారు. వారెవరో తెలుసుకుందాం.

లాంగ్​ గ్యాప్​ తర్వాత సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీరే!

విరాట్​ కోహ్లీ :
2019 నవంబర్ 22 బంగ్లాదేశ్‌పై విరాట్ తన 70వ సెంచరీని సాధించిన రోజు. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల శతకాలపై దృష్టి సారించలేకపోయాడు. అనంతరం ​కొవిడ్​ విజృంభన తగ్గిన తర్వాత క్రికెట్​ తిరిగి ప్రారంభమైంది. ఆట మొదలుపెట్టిన విరాట్‌ గతంలోలాగా బ్యాటింగ్​లో రాణించలేకపోయాడు. సెంచరీలకు ఆమడ దూరంలో ఉండిపోయాడు. దీంతో విరాట్ ఆటతీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

2022లో జరిగిన మ్యాచ్​లలో సగానికి పైగా మ్యాచ్​ల్లో ఆడాడు విరాట్. సెంచరీలు చేయలేకపోవడం తప్ప.. 50 లోపు పరుగుల చేసిన విరాట్​ ప్రదర్శన బాగానే ఉంది. కాగా, దాదాపు 1021 రోజుల సుదీర్ఘమైన గ్యాప్​ తర్వాత తన 71వ సెంచరీని చేశాడు. ఆసియా కప్​లో ధనాధన్​ ఇన్నింగ్స్​ ఆడి అఫ్ఘానిస్థాన్​పై 61 బంతుల్లో 122 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు. ఆ తర్వాత నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన పోరులో 91 బంతుల్లో 113 పరుగులు తీశాడు. ఈ ఏడాది అతనికిది రెండో శతకం. అలాగే వన్డేల్లో 44వది, అంతర్జాతీయ క్రికెట్‌లో 72వ సెంచరీ.

Kohli Centuries
విరాట్​ కోహ్లీ

స్టీవ్​ స్మిత్​ :
దిగ్గజ టెస్ట్ క్రికెటర్లలో ఆస్ట్రేలియన్ బ్యాటర్ స్టీవ్​ స్మిత్​ ఒకరు. విరాట్​ కొహ్లీ, ఇంగ్లాండ్​ ఆటగాడు జో రూట్​, న్యూజీలాండ్​ ప్లేయర్​ కేన్​ విలియమ్​సన్​తో కలిసి స్మిత్​ ఫ్యాబ్​ ఫోర్​ అనే పేరును తెచ్చుకున్నాడు. కానీ ఈ​ బ్యాటర్ కూడా కొంతకాలం సెంచరీ కోసం కష్టపడ్డాడు.

2021 జనవరిలో భారత్‌పై 131 పరుగులు చేసి చివరిసారిగా సెంచరీ మార్కును అందుకున్నాడు. ఆ తర్వాత ఆడిన 26 ఇన్నింగ్స్‌ల్లో, స్మిత్ 35.95 సగటుతో 863 పరుగులు, ఎనిమిది అర్ధ సెంచరీలు చేశాడు. కాగా, దాదాపు ఏడాదిన్నర తర్వాత 2022 జూలైలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో స్మిత్ తన 39వ​ సెంచరీని సాధించాడు. ఆ తర్వాత మరో రెండు సెంచరీలు కొట్టాడు. దీంతో స్మిత్​ శతకాల సంఖ్య 41కి చేరింది.

Smith Centuries
స్టీవ్​ స్మిత్

డేవిడ్​ వార్నర్​ :
మరో ఆసీస్​ ఆటగాడు వార్నర్ తన 43వ అంతర్జాతీయ సెంచరీని భారత్‌పై సాధించాడు. 2020 జనవరి 14న జరిగిన ఆ మ్యాచ్​లో 128* పరుగులు చేశాడు. దీని తరువాత, అతను ఒక్క సెంచరీ చేయకుండానే 67 ఇన్నింగ్స్‌ ఆడాడు. అనంతరం 1043 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత 2022 నవంబర్ 22న శతకం సాధించాడు. ఇంగ్లాండ్​తో తలపడిన మ్యాచ్​లో 106 పరుగులు చేసి తన 44వ సెంచరీని సాధించాడు. తాజాగా డిసెంబర్​ 27న సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో డబుల్​ సెంచరీతో సత్తా చాటాడు. కాగా, డేవిడ్​ వార్నర్​కు ఇది వందో టెస్టు మ్యాచ్​ కావడం విశేషం.

తన కెరీర్‌లో 26వ టెస్టు సెంచరీ నమోదు చేసిన వార్నర్‌.. దిగ్గజాల సరసన చోటు సంపాదించాడు. టెస్ట్‌ల్లో వార్నర్ ఓపెనర్ బ్యాట్స్‌మెన్‌గా వచ్చి అత్యధిక సెంచరీలు సాధించిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. ఓపెనర్ బ్యాట్స్‌మెన్‌గా వచ్చి సునీల్ గవాస్కర్ (33), అలెస్టర్ కుక్(31), మాథ్యూహెడేన్(30), గ్రీమ్ స్మిత్ (27) సెంచరీలు చేయగా డేవిడ్ వార్నర్ 26 సెంచరీలతో జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు.

Warner Centuries
డేవిడ్​ వార్నర్

ఛెతేశ్వర్​ పుజారా:
పుజారా చివరిసారిగా 2019 జనవరి 3న ఆస్ట్రేలియాతో జరిగిన ఇన్నింగ్స్​లో 193 పరుగులతో సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఆడిన మ్యాచ్​ల్లో ఫర్వాలేదనిపించాడు. కాగా, 1443 రోజుల సుదీర్ఘమైన గ్యాప్​ తర్వాత సెంచరీ 2022లో శతకం సాధించాడు. డిసెంబర్ 14న బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్​లో 102* పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్​లో పుజారాకు ఇది 19వ శతకం. టెస్టు​ల్లో 7000కు పైగా పరుగులు చేసిన పుజారాను బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో అద్భతమైన ఫామ్​లో చూడాలని భారత క్రికెట్​ అభిమానులు ఆశిస్తున్నారు.

Pujaara Centuries
ఛెతేశ్వర్​ పుజారా

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.