ప్రభుత్వం అనుమతిస్తే ఈనెల 18 తర్వాత భారత క్రికెటర్లకు సాధన మొదలవుతుందని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ తెలిపారు. ఆటగాళ్ల నివాసాలకు దగ్గర్లోని మైదానాల్లో శిక్షణ కొనసాగేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
"వీలైనంత త్వరగా భారత ఆటగాళ్లు మళ్లీ మైదానంలో శిక్షణ పొందేలా చేసేందుకు బీసీసీఐ అన్ని రకాల ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే ఈ నెల 18 తర్వాత సాధన మొదలయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెటర్లు ప్రయాణించలేరు. వారి నివాసాలకు దగ్గరలోని మైదానాల్లో శిక్షణ కొనసాగించేలా ఏర్పాట్లు చేస్తాం. బీసీసీఐ యాప్ సాయంతో క్రికెటర్లు వాళ్ల ఇళ్లలోనే ఫిట్‌నెస్ డ్రిల్స్ చేస్తున్నారు. లాక్‌డౌన్ తర్వాత ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం" అని అరుణ్ తెలిపారు.
ఇదీ చూడండి.. మొబైల్యాప్ ద్వారా ఆటగాళ్ల ఫిట్‌నెస్ పర్యవేక్షణ