ETV Bharat / sports

'కచ్చితంగా ఆ అనుభూతిని మిస్​ అవుతాం!'

ప్రేక్షకులు లేకుండా టోర్నమెంట్లను నిర్వహించాలనే నిర్ణయంపై టీమ్​ఇండియా ఓపెనర్​ శిఖర్​ ధావన్​ స్పందించాడు. అలా మ్యాచ్​లు ఆడటం వల్ల చాలా అనుభూతిని మిస్​ అవుతామని అభిప్రాయపడ్డాడు.

We Will Miss 'Playing In Front Of Huge Crowd': Shikhar Dhawan
'కచ్చితంగా ఆ అనుభూతిని మిస్​ అవుతాం!'
author img

By

Published : May 25, 2020, 5:16 AM IST

స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించకపోతే క్రికెటర్లంతా ఆ అనుభూతిని మిస్​ అవుతారని అభిప్రాయపడ్డాడు టీమ్​ఇండియా ఓపెనర్​ శిఖర్​ ధావన్​. శ్రీలంక కెప్టెన్​ మాథ్యూస్​తో జరిగిన ఇన్​స్టాగ్రామ్​ లైవ్​ సెషన్​లో ఈ విషయాన్ని వెల్లడించాడు.

"ప్రేక్షకులు లేకుండా మ్యాచ్​లు జరిగితే వారి నుంచి మనం పొందే అనుభూతిని కోల్పోతాం. కానీ, మనం రెండు నెలలుగా ఇంట్లో కూర్చున్నాం. అందువల్ల ఇది మనకు వచ్చిన అవకాశంగా భావించాలి. తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం".

-శిఖర్​ ధావన్​, టీమ్​ఇండియా ఓపెనర్​

ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు శిఖర్​ ధావన్​. ఈ ఏడాది ఐపీఎల్ కచ్చితంగా​ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల ఆరోగ్య భద్రతను పాటిస్తూనే టోర్నమెంట్​ను నిర్వహిస్తారని అభిప్రాయపడ్డాడు. మార్చి 29 నుంచి నిర్వహించాల్సిన ఐపీఎల్​ కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడింది.​

ఇదీ చూడండి... నీటిపై బౌన్స్​ అయింది.. బ్యాట్స్​మన్ దిమ్మతిరిగింది​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.