ETV Bharat / sports

సఫారీ జట్టులో కరోనా కలకలం.. ఇద్దరికి పాజిటివ్​ - సఫారీ జట్టులో కరోనా వార్తలు

కరోనా దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా క్రీడారంగం కుదేలైపోయింది. ఇప్పుడిప్పుడే మళ్లీ టోర్నీలు మొదలవుతున్న తరుణంలో ఆటగాళ్లు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఇద్దరు దక్షిణాఫ్రికా క్రికెటర్లకు కొవిడ్​-19 పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లు వెల్లడించింది ఆ దేశ క్రికెట్​ బోర్డు. అయితే వారి పేర్లను మాత్రం బహిర్గతం చేయలేదు.

cricketers corona news
సఫారీ జట్టులో కరోనా కలకలం.. ఇద్దరు ప్లేయర్లకు పాజిటివ్​
author img

By

Published : Aug 20, 2020, 4:40 PM IST

Updated : Aug 20, 2020, 4:58 PM IST

దక్షిణాఫ్రికాలో ఇద్దరు క్రికెటర్లు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఆటగాళ్లు, సిబ్బందికి కలిపి 50 మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరు పాజిటివ్‌గా తేలారు. వారి పేర్లను క్రికెట్‌ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) బహిర్గతం చేయలేదు. పరీక్షలు చేయించుకున్న వారిలో కెప్టెన్‌ క్వింటన్‌ డికాక్‌, మార్కరమ్‌, ఫెలుక్వాయో, డీన్‌ ఎల్గర్‌, డేవిడ్‌ మిల్లర్‌, కాగిసో రబాడ, కేశవ్‌ మహరాజ్‌ వంటి ఆటగాళ్లు ఉన్నారు.

ఆగస్టు 18 నుంచి 22 వరకు కుకుజాలో పురుషుల జట్టు కోసం సాంస్కృతిక శిబిరాన్ని ఏర్పాటు చేసింది దక్షిణాఫ్రికా క్రికెట్​ బోర్డు. ఇందుకోసం ఆటగాళ్లందరికీ పరీక్షలు నిర్వహించారు. వారిలో ఇద్దరికి కొవిడ్‌-19 ఉన్నట్టు తేలింది.

"వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు నిబంధనల ప్రకారం పరీక్షలు చేశాం. ఇద్దరికి పాజిటివ్‌ రావడం వల్ల ఐసోలేషన్‌కు పంపించాం. వారికి ప్రత్యామ్నాయంగా ఎవరినీ ఎంపిక చేయలేదు. అనుకోని కారణాలతో శిబిరానికి రాలేని వారిని వర్చువల్‌గా హాజరవ్వాలని సూచించాం" అని సీఎస్‌ఏ ప్రకటించింది.

దక్షిణాఫ్రికా మాజీ సారథి ఫా డుప్లెసిస్‌ ఈ శిబిరానికి హాజరుకాలేదు. అతడు రెండోసారి తండ్రి కావడం వల్ల ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నాడు. దియూనిస్‌ డీబ్రూన్‌ కుటుంబ కారణాలతో మొదట మిస్సైనప్పటికీ.. ఇప్పుడు కుకుజాలో జట్టుతో కలిశాడు.

దక్షిణాఫ్రికా క్రికెట్​లో జాతివివక్ష పెరగకుండా అడ్డుకొనేందుకు సాంస్కృతిక శిబిరాలను ఏర్పాటు చేస్తారు. జులైలో మహిళల జట్టుకు ఇందుకోసమే పరీక్షలు చేయగా.. 34 మందిలో ముగ్గురికి కొవిడ్‌-19 సోకినట్టు తెలిసింది.

Last Updated : Aug 20, 2020, 4:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.