ETV Bharat / sports

'28 ఏళ్ల అనుబంధం.. ఇప్పుడు చాలా వెలితిగా ఉంది'

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్​ మిథాలీ రాజ్​.. లాక్​డౌన్​ కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమైంది. ఇంట్లోనే వ్యాయామాలు చేస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం సహా తన ఆత్మకథతో పుస్తకం రాస్తున్నానని ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపింది మిథాలీ​.

Teamindia Women's Formar Captain Mithali Raj special interview in lockdown
'వంటపై ఆసక్తి లేదు.. ఇంట్లో ఇప్పటికి పేయింగ్​ గెస్ట్​నే!'
author img

By

Published : May 21, 2020, 7:33 AM IST

ఉదయాన్నే 5 గంటలకు లేవడం.. 6 గంటలకల్లా మైదానంలో అడుగుపెట్టడం.. టర్ఫ్‌ వికెట్‌ను తేరిపారా చూసుకోవడం.. అలసిపోయే వరకు బ్యాటింగ్‌ సాధన చేయడం! టీమ్‌ఇండియా మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ గత 28 ఏళ్లుగా పాటిస్తున్న దినచర్య ఇది. ఎప్పుడూ క్రికెట్‌తో బిజీగా ఉండే మిథాలీ ప్రస్తుత లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైంది. బ్యాటు, బంతిని పక్కనబెట్టి పెన్ను, పుస్తకానికి దగ్గరైంది. ఆత్మకథ రాయడానికి లాక్‌డౌన్‌ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లు చెబుతున్న మిథాలీతో ఫోన్‌లో ప్రత్యేక ఇంటర్వ్యూ.

పుస్తకాలు చదువుతున్నా

టీమ్‌ఇండియా మాజీ మానసిక కోచ్‌ పాడీ అప్టాన్‌ రాసిన 'బేర్‌ ఫుట్‌' చదివా. విలియం డాల్‌రింపుల్‌ నవల 'వైట్‌ మొఘల్స్‌' చదువుతున్నా. మొఘలుల కాలంలో హైదరాబాద్‌ గురించి పుస్తకంలో బాగా రాశారు.

నిద్ర లేమి సమస్య

క్రీడాకారుల కెరీర్‌లో నిద్రలేమి సమస్యే ఉండదు. రోజంతా మైదానంలో ఉంటాం కాబట్టి పడుకోగానే నిద్ర పడుతుంది. రాత్రి 10 గంటలకు ఠంచనుగా పడుకోవడం నాకు అలవాటు. ఇప్పుడు శారీరక శ్రమ లేకపోవడం వల్ల నిద్ర రావట్లేదు. గాఢమైన నిద్ర ఉండట్లేదు. ఫిజియోతో మాట్లాడితే కొన్ని సూచనలు ఇచ్చారు. ఇంట్లో ఉదయం, సాయంత్రం వ్యాయామం చేయడానికి ఇదే కారణం.

వీక్షకులు పెరుగుతారు

కెరీర్‌లో ఎక్కువ శాతం ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు ఆడా. ఖాళీ స్టేడియాలు నాకు కొత్తకాదు. నాకు తెలిసి 2017, 2019 మహిళల ప్రపంచకప్‌ల సమయంలో స్టేడియాలు ప్రేక్షకులతో నిండాయి. మళ్లీ మేం పాత రోజులకు వెళ్లిపోతాం. ప్రేక్షకులు లేకుండానే ఆడతాం. ఈ పరిస్థితికి ఎవరినీ నిందించలేం. మనల్ని మనం కాపాడుకోవాల్సిందే. పురుషుల క్రికెట్‌ ఎప్పుడూ ప్రేక్షకులతో కిక్కిరిసిపోతుంది. ఖాళీ స్టేడియాల్లో ఆడాలంటే వారికి కష్టంగా ఉంటుంది. అయితే టీవీలు, ఇంటర్నెట్‌లో వీక్షకుల సంఖ్య పెరగొచ్చు. టీవీల్లో వినోద కార్యక్రమాలు ప్రారంభమయ్యేందుకు సమయం పడుతుంది. ఈలోపు క్రికెట్‌ ప్రారంభమైతే వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరగడం ఖాయం. క్రికెట్‌ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలకు మంచి స్పందన ఖాయం.

బాధ్యత పెరిగింది

నాన్నకు బాగా దగ్గరయ్యా. ఆయనకు 70 ఏళ్లు. ఇన్నాళ్లు ఆట గురించే మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు క్రికెటేతర విషయాలు చర్చించుకుంటున్నాం. అందరం కలిసి తింటున్నాం. ఇంతకుముందు సమయం ఉండేదే కాదు. క్రికెట్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. ఈ రెండు నెలలు ఇంట్లో ఉండటం వల్ల బాధ్యత పెరిగినట్లుగా అనిపిస్తుంది. అమ్మ, నాన్నలను చూసుకోవాలన్న తపన కలుగుతోంది.

వంటలపై ఆసక్తి లేదు

లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నా. లాక్‌డౌన్‌కు ముందు నేను న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్నా. వీసాలపై కేంద్ర ప్రభుత్వ ఆంక్షలు ప్రారంభానికి ముందురోజు సాయంత్రం 5 గంటలకు ఇంటికి చేరుకున్నా. 15 రోజులు స్వీయ నిర్బంధంలో ఉన్నా. అప్పట్నుంచి ఇంట్లోనే. మొదట్లో కొంచెం కష్టంగా అనిపించింది. ఇప్పుడు అలవాటైంది. చాలామంది వంట చేస్తున్న వీడియోలు పోస్ట్‌ చేస్తున్నారు. నేను మాత్రం ఎప్పట్లాగే పేయింగ్‌ గెస్ట్‌లాగే ఉంటున్నా. వంట నేర్చుకోమని అమ్మ అంటుంది. కాని వంట నేర్చుకోవడంపై అస్సలు ఆసక్తి లేదు. ఇన్ని రోజుల లాక్‌డౌన్‌ నన్ను వంట గదిలోకి నడిపించలేకపోయింది. ఇల్లు ఊడవడం.. తుడవటం నాకు అలవాటే. ఇప్పుడూ చేస్తున్నా.

వెలితిగా ఉంది

క్రికెట్‌తో నాది 28 ఏళ్ల అనుబంధం. పదేళ్ల వయసు నుంచి రోజూ ఉదయం 6 గంటలకల్లా మైదానానికి చేరుకోవడం అలవాటు. ఇప్పుడు మైదానానికి దూరం కావడం వల్ల చాలా వెలితిగా అనిపిస్తోంది. లాక్‌డౌన్‌ లేనప్పుడు ఉదయం పూట సెయింట్‌ జాన్స్‌ మైదానం క్రికెటర్లతో నిండిపోతుంది. మాట్లాడుతూ.. పరుగెత్తుతూ.. సాధన చేస్తూ.. ఫీల్డింగ్‌, క్యాచింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తుంటే హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఉదయం 10 గంటలకు నిద్ర లేచినా అడిగేవారు లేరు. నేను 11 గంటలకు ట్రెయినింగ్‌ చేస్తున్నా.

ఆత్మకథపై దృష్టి

మైదానానికి వెళ్లే అవకాశం లేదు. ఇంట్లోనే వ్యాయామం చేస్తూ ఫిట్‌నెస్‌ కాపాడుకుంటున్నా. ట్రెయినర్‌ చెప్పినట్లుగా ఇంట్లో, సెల్లార్‌లో కసరత్తులు చేస్తున్నా. ఇంట్లో అందుబాటులో ఉండే కుర్చీ, వాటర్‌ బాటిల్స్‌, లూప్‌ బ్యాండ్‌తో స్ట్రెచింగ్‌ చేస్తున్నా. ఈ లాక్‌డౌన్‌ సమయంలో ఆత్మకథ 'అన్‌గార్డెడ్‌' పూర్తిచేయడంపై దృష్టిసారించా. పుస్తకం పూర్తవడానికి ఇంకా సమయం పడుతుంది.

ఇదీ చూడండి.. 'ప్రపంచకప్​లో బౌలౌట్​ విజయం ధోనీ వల్లే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.