జట్టు సారథ్యాన్ని పంచుకోవడం విరాట్ కోహ్లీకి నప్పదని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ అన్నాడు. భిన్న సారథ్య సూత్రం టీమ్‌ఇండియాకు పనికి రాదని అభిప్రాయపడ్డాడు.
"కోహ్లీ గంభీరమైన వ్యక్తి. సారథ్యాన్ని పంచుకోవడం అతడికి నప్పదు. బాధ్యతల్ని ఇంకొకరికి అప్పగించడానికి కోహ్లీ ఇష్టపడడు. ఈ విషయంలో ఇంగ్లాండ్ పూర్తి భిన్నంగా ఉంటుంది. మోర్గాన్, రూట్‌లు శాంత స్వభావులు. సర్దుకుపోతారు. భారత జట్టుకు మాత్రం భిన్న సారథ్య సూత్రం పనికిరాదు. భిన్న కోచ్‌ల అంశాన్ని పరిశీలించొచ్చు. ఎంతోమంది ప్రతిభావంతులున్నా నాలుగో నంబరు బ్యాట్స్‌మన్ ఎంపిక విషయంలో భారత్ తడబడింది. ఈ నేపథ్యంలో ఇద్దరు కోచ్‌ల నియమాకం మంచి ఆలోచనే. దాని వల్ల మంచి ఫలితాలు రాబట్టే అవకాశముంది" అని నాసిర్ చెప్పాడు.
ఇదీ చూడండి.. లాక్డౌన్ మ్యారేజ్: డాక్టర్తో యాక్టర్ ప్రణయగానం