టీమ్ఇండియా మాజీ క్రికెటర్, లిటిల్ మాస్టర్ సచిన్ తెందూల్కర్ తరచూ సోషల్ మీడియాలో సరదా పోస్టులను అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. తాజాగా వర్షంలో తడుస్తూ ఆనందంగా ఆస్వాదిస్తున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశాడు. ఈ క్రమంలోనే "వర్షం గురించి మాత్రమే ఆలోచించిన సందర్భాన్ని మీరు కూడా గుర్తు తెచ్చుకోండి" అంటూ రాసుకొచ్చాడు. కరోనా మహమ్మారి కారణంగా ఈ బ్యాటింగ్ లెజెండ్ ప్రస్తుతం తన కుటుబుంతో కలిసి సరదాగా గడుపుతున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
క్రికెట్ చరిత్రలోనే సచిన్ అద్భుతమైన ఆటగాడు. 1989లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌తో భారత్ తరఫున అరంగేట్రం చేసిన లిటిల్ మాస్టర్.. తన కెరీర్లో 200 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఏకైక క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. ఈ ఫార్మాట్లో మొత్తం 15, 921 పరుగులు చేశాడు.
వన్డేలో మొత్తం 463 మ్యాచ్‌లు ఆడగా.. 49 సెంచరీలు, 96 అర్ధ సెంచరీలతో 18, 426 పరుగులు సాధించాడు. 2010లో 50 ఓవర్ల ఫార్మాట్లో డబుల్ సెంచరీ చేసి.. ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు.