ఈ ఏడాది టీమ్ఇండియా ఆడిన వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపిక కాకపోయినా సరే హిట్‌మ్యాన్ ఈ ఘనత సాధించడం విశేషం. ఈ రికార్డు సాధించడం రోహిత్‌కు వరుసగా ఇది ఎనిమిదోసారి కావడం విశేషం.
ఈ జనవరిలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో రోహిత్ 119 పరుగులు చేశాడు. ప్రసుత్తం ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఒక్క భారత ఆటగాడు కూడా సెంచరీ చేయలేకపోయారు.
గత ఎనిమిదేళ్లుగా వన్డేల్లో రోహిత్..
2013 - 209 పరుగులు
2014 - 264
2015 - 150
2016 - 171*
2017 - 208*
2018 - 152
2019 - 159
2020 - 119
కోహ్లీ సెంచరీ చేయకుండానే..
2008లో అంతర్జాతీయ కెరీర్ మొదలైనప్పటి నుంచి వన్డేల్లో ప్రతి ఏటా కనీసం ఒక సెంచరీ అయినా చేస్తూ వచ్చాడు కోహ్లీ. ఈ ఏడాది మాత్రం శతకం చేయకుండానే సీజన్‌ను ముగించాడు. సంవత్సరంలో 10 కన్నా తక్కువ వన్డేలు ఆడటం కూడా ఇదే తొలిసారి.
సెంచరీ చేయలేకపోయినా సరే కోహ్లీ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో సచిన్ తెందుల్కర్‌కు అధిగమించాడు. 242 ఇన్నింగ్స్‌ల్లోనే విరాట్ ఈ మార్క్‌ను అందుకోవడం విశేషం.