ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ గ్లెన్ మెక్‌గ్రాత్ బౌలింగ్‌లో తనకు ఆడాలనుందని అంటున్నాడు టీమ్ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఇలా చెప్పాడు.
-
Q: If you've to pick one Bowler from the past, whom you would like to face. Who'll be that one Bowler? @ImRo45 #askro
— Rohit Sharma (@ImRo45) August 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
- @LoyalSachinFan
A: pic.twitter.com/layuKzSIcx
">Q: If you've to pick one Bowler from the past, whom you would like to face. Who'll be that one Bowler? @ImRo45 #askro
— Rohit Sharma (@ImRo45) August 2, 2020
- @LoyalSachinFan
A: pic.twitter.com/layuKzSIcxQ: If you've to pick one Bowler from the past, whom you would like to face. Who'll be that one Bowler? @ImRo45 #askro
— Rohit Sharma (@ImRo45) August 2, 2020
- @LoyalSachinFan
A: pic.twitter.com/layuKzSIcx
"గతంలోని ఆటగాళ్లతో ఆడే అవకాశం వస్తే మీరు ఎవరితో ఆడాలనుకుంటున్నారు?" అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. "మెక్‌గ్రాత్ బౌలింగ్‌ను ఎదుర్కొవాలనుకుంటున్నాను" అని వీడియో ద్వారా ట్విట్టర్లో సమాధానమిచ్చాడు రోహిత్.
టెస్టుల్లో అత్యధికంగా వికెట్లు
మెక్‌గ్రాత్.. ఆసీస్ తరఫున 124 టెస్టులాడి, 563 వికెట్లను పడగొట్టడాడు. వన్డేల్లో 381 వికెట్లు తీశాడు. 2007 ప్రపంచకప్ తర్వాత ఆటకు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు.
అన్ని ఫార్మాట్లో స్థానం సుస్థిరం
రోహిత్ శర్మ.. అన్ని ఫార్మాట్లలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. పరిమిత ఓవర్లకు భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గతేడాది ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు నమోదు చేయడం సహా అత్యధిక పరుగులు(648) చేసిన బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకున్నాడు.
ఖేల్ రత్నకు ఎంపిక
రోహిత్ శర్మ.. కెరీర్లో 224 వన్డేలు, 108 టీ20లు, 32 టెస్టుల్లో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 14,029 పరుగులను నమోదు చేశాడు. రోహిత్‌ను ఇటీవలే రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డు 2020కు బీసీసీఐకి నామినేట్ చేసింది.