లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉన్న టీమ్ఇండియా క్రికెటర్ రోహిత్ శర్మ.. తన వ్యక్తిగత జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను 'ఓపెన్ నెట్స్ విత్ మయాంక్' షోలో పంచుకున్నాడు. సహచర ఆటగాడు శిఖర్ ధావన్‌తో కలిసి ఇందులో పాల్గొన్నాడు. తన మూడో ద్విశతకాన్ని గుర్తు చేసుకున్న రోహిత్.. ఆరోజు తన భార్య రితిక కన్నీళ్లు పెట్టుకోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు.
"ఆ మ్యాచ్‌లో నేను 195 పరుగుల వద్ద ఉన్నప్పుడు సింగిల్ తీయాల్సి వచ్చింది. పరుగు కోసం ప్రయత్నించే క్రమంలో డైవ్ చేశాను. ఆ సమయంలో, నేను డబుల్ సెంచరీ చేయకముందే అంటే 196 పరుగుల వద్ద ఉన్నప్పుడు రితికా భావోద్వేగానికి లోనైంది. ఎందుకు ఏడ్చావు అని ఆమెను (రితిక) అడిగాను? అప్పుడు పరుగు తీస్తున్న క్రమంలో డైవ్ చేయడం వల్ల చేతికి దెబ్బ తగిలిందేమోనని ఏడ్చానంటూ ఆమె తర్వాత చెప్పింది. ఆరోజు చేసిన ద్విశతకం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఆ రోజే మా పెళ్లిరోజు కాబట్టి"
-రోహిత్ శర్మ, టీమిండియా క్రికెటర్.
మొహాలి వేదికగా శ్రీలంకతో జరిగిన ఈ వన్డేలో ద్విశతకం సాధించిన రోహిత్ శర్మ.. ఈ ఫార్మాట్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. దీనితో పాటే వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు(264) సాధించిన బ్యాట్స్‌మన్‌గా రికార్డుకెక్కాడు.
ఇదీ చూడండి : కరోనా సమయంలో ఫుట్‌బాల్ మ్యాచ్.. 30 వేల మందితో!