ETV Bharat / sports

వైరల్ వీడియో: ద్రవిడ్​ క్యాచ్​ పడితే అంతే!

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ రాహుల్​ ద్రవిడ్​ బ్యాటింగ్​లోనే కాక ఫీల్డింగ్​లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చేవాడు. ఇతడు పట్టిన క్యాచ్​లకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది.

author img

By

Published : Jun 30, 2020, 1:24 PM IST

Rahul Dravid's stunning reflex catches
ద్రవిడ్

రాహుల్ ద్రవిడ్​ను మిస్టర్ డిపెండబుల్​, ది వాల్ అని కీర్తిస్తుంటారు అభిమానులు. బ్యాటింగ్​కు దిగాడంటే బౌలర్ల సహనానికి పరీక్షే. అతడి ఆటతీరుకి ఫిదా అవ్వని క్రికెట్ ఫ్యాన్స్ ఉండరు. బ్యాటింగ్​లోనే కాకుండా ఫీల్డింగ్​లోనూ ద్రవిడ్​ది ప్రత్యేక బాటే. ఎక్కువగా స్లిప్​, గల్లీల్లో పీల్డింగ్ చేసే ఈ ఆటగాడు క్యాచ్​లు పట్టడంలోనూ దిట్ట. అందుకు సాక్ష్యం ఈ వీడియోనే. తాజాగా స్పిన్నర్ హర్భజన్ సింగ్ షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు పట్టిన అద్భుత క్యాచ్​లకు నెటిజన్లతో పాటు క్రికెటర్లు ఫిదా అవుతున్నారు. అద్భుతం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

టీమ్​ఇండియా తరఫున అత్యధిక క్యాచ్​లు పట్టిన ఆటగాడిగా ద్రవిడ్​కు రికార్డుంది. మొత్తం 504 మ్యాచ్​ల్లో 333 క్యాచ్​లు పట్టాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక క్యాచ్​లు పట్టిన ఆటగాళ్లలో ద్రవిడ్​ది నాలుగో స్థానం. ఇతడికంటే ముందు జయవర్ధనే (శ్రీలంక), పాంటింగ్ (ఆస్ట్రేలియా), జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా) ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.