ETV Bharat / sports

లాక్​డౌన్ సమయంలో స్మృతి ఏం చేస్తుందో తెలుసా! - స్మృతి మంధాన లాక్​డౌన్​

కరోనా లాక్​డౌన్ కారణంగా క్రీడాకారులంతా ఇంటికే పరిమితమయ్యారు. వారికి నచ్చిన వ్యాపకాలతో సమయాన్ని గడుపుతున్నారు. కానీ, టీమ్​ఇండియా మహిళా క్రికెటర్లంతా 'లూడో' గేమ్​ ద్వారా కలిసే ఉన్నామంటోంది స్మృతి మంధాన.

Playing ludo online together is helping Indian women cricket team maintain bond: Mandhana
సినిమాలు, ఆన్​లైన్​ గేమ్స్​తో బిజీగా మంధాన!
author img

By

Published : Apr 13, 2020, 1:48 PM IST

లాక్​డౌన్​ సమయంలో కుటుంబంతో విలువైన సమయాన్ని గడుపుతున్నానని చెబుతోంది టీమ్​ఇండియా మహిళా ఓపెనర్​ స్మృతి మంధాన. ప్రస్తుతం క్రికెటర్లంతా ఎవరికి వారు దూరంగా ఉన్నా.. 'లూడో' గేమ్​తో మా బంధాన్ని కొనసాగిస్తున్నామని తెలిపింది. ఆమెకు సంబంధించిన ఓ వీడియోను బీసీసీఐ ట్వీట్​ చేసింది.

"లూడో గేమ్​ ద్వారా మేమంతా కలిసే ఉన్నాం. ఫిట్​నెస్​ కొనసాగించడానికి ఎల్లప్పుడూ ట్రైనర్​ సలహాలను స్వీకరిస్తున్నా. లాక్​డౌన్​ సమయంలో కుటుంబంతో విలువైన సమయాన్ని గడుపుతున్నా. వంటలో అమ్మకు సాయంగా ఉంటూ సోదరుడ్ని ఆటపట్టిస్తున్నా. నాకు సినిమాలంటే ఇష్టం. కానీ, వారానికి మూడు సినిమాలే చూస్తున్నా. రోజంతా ఆనందంగా గడపటం కోసం 10 గంటలు నిద్రపోతున్నా."

-స్మృతి మంధాన, టీమ్​ఇండియా మహిళా క్రికెటర్​

ఈ సంక్షోభ సమయంలో ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ.. శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఆరోగ్యంగా ఉండాలని కోరింది మంధాన. ఇంటివద్దే ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది.

  • ' class='align-text-top noRightClick twitterSection' data=''>

ఇదీ చూడండి.. ఐపీఎల్​ జరగకపోతే ధోనీకి కష్టమంటోన్న మాజీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.