భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్‌ల వివాదం ఇప్పుడప్పడే సద్దుమణిగేట్లు లేదు. తాజాగా రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో వీరిద్దరితో పాటు వ్యాఖ్యాత కరణ్జోహార్పైనా కేసు నమోదైంది. గతేడాది డిసెంబరులో కాఫీ విత్ కరణ్ షోలో హార్దిక్, రాహుల్‌లు మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ అనుచిత వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. ఫలితంగా, బీసీసీఐ వీరిపై సస్పెన్షన్ విధించింది.
అనంతరం క్షమాపణ చేప్పిన ఈ వర్ధమాన క్రీడాకారులపై బీసీసీఐ పాలకమండలి సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. వివాదం అనంతరం న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో హార్ధిక్ ఆడగా, దేశవాళీ మ్యాచ్‌లపై దృష్టిపెట్టాడు రాహుల్.