" విశ్వవిజేతగా అవతరించిన ఇంగ్లాండ్‌ను ఓడించడం జీవితంలో ఓ కల... దాన్ని అప్పుడే అందుకోలేకపోయినా ప్రస్తుతం లార్డ్స్‌లోని హానర్స్ బోర్డులో చోటు దక్కించుకున్నా" అని సంతోషం వ్యక్తం చేశాడు ఐర్లాండ్ బౌలర్ టిమ్ ముర్తా. బుధవారం ప్రారంభమైన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో 13 పరుగులిచ్చి 5 వికెట్లతో చెలరేగాడు. ఫలితంగా ఇంగ్లాండ్ జట్టు బుధవారం జరిగిన మొదటి ఇన్నింగ్స్‌లో 85 పరుగులకే ఆలౌటైంది.
అక్కడే పుట్టి.... మరో జట్టులో చేరి
37 ఏళ్ల పేసర్ టిమ్ ముర్తా... లండన్‌లో పుట్టి ఐర్లాండ్ తరఫున క్రికెట్ ఆడుతున్నాడు. లార్డ్స్ ఆధ్వర్యంలోని మిడిల్‌ఎసెక్స్ జట్టులో భాగస్వామిగా ఉండేవాడు. 2007లో సుర్రే జట్టులో చేరాడు. ఈ మ్యాచ్ ముందు వరకు లార్డ్స్‌లో మొత్తం 291 వికెట్లు తీశాడు ముర్తా. స్వదేశంలో జరిగిన టెస్టుల్లో ఐదు వికెట్లు లేదా అంతకంటే ఎక్కువ తీసిన బౌలర్ల పేర్లను లార్డ్స్‌లోని హానర్ బోర్డులో లిఖిస్తారు. ఈ విధంగా ముర్తాకు చోటుదక్కింది.
" కుర్రాడిగా ఉన్నప్పుడు హానర్ బోర్డులో పేరు కనిపించాలనేది నా కల. ఇప్పటికి సాకారమైంది. ఒక క్రికెటర్‌గా ఇంతకన్నా అద్భుతమైన ఫీలింగ్ ఏముంటుంది?. నా కెరీర్లోనే ఇదొక మధుర ఘట్టం".
-- టిమ్ ముర్తా, ఐర్లాండ్ క్రికెటర్
ఇంగ్లాండ్‌తో జరిగిన జులై 24న ప్రారంభమైన 5 రోజుల టెస్టు మ్యాచ్‌లో... తొలి రోజే 5 వికెట్లతో అదరగొట్టాడు. ఈ ఆటలోనే కెరీర్లో 800 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. 9 ఓవర్లు వేసి 13 పరుగులు మాత్రమే ఇచ్చిన ముర్తా... 5 వికెట్లు సాధించాడు. ఇదే అతడి టెస్టు క్రికెట్లో అత్యుత్తమం.
ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 207 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్‌పై 122 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.