ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్​ నిర్వహణ.. మాకు దక్కిన గౌరవం

టీ20 ప్రపంచకప్​ను భారత్​లో నిర్వహించడం తమకెంతో గర్వకారణమని బీసీసీఐ అధ్యక్షుడు​ గంగూలీ అన్నాడు. టోర్నీ నిర్వహణ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.

Matter of great honour for us to be hosting T20 WC 2021, says Ganguly
'టీ20 ప్రపంచకప్​ నిర్వహించడం మాకు దక్కిన గౌరవం'
author img

By

Published : Nov 12, 2020, 4:27 PM IST

వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్​నకు ఆతిథ్యం ఇవ్వనుండటం ఎంతో గౌరవాన్ని తెచ్చిపెడుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ చెప్పాడు. ఐసీసీ టోర్నీని నిర్వహించడానికి బోర్డు అధ్యక్షుడిగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.

"పురుషుల టీ20 ప్రపంచకప్​నకు ఆతిథ్యం ఇవ్వడం మాకెంతో గౌరవం. 1987లో వన్డే ప్రపంచకప్​ నుంచి అనేక అంతర్జాతీయ ఈవెంట్లను భారత్​ విజయవంతంగా నిర్వహించింది. ఇక్కడ ఆడేందుకు క్రికెటర్లంతా ఉత్సాహంగా ఉంటారని నేను కచ్చితంగా భావిస్తున్నాను. ఐసీసీ ఈవెంట్లలో పాల్గొనడాన్ని ఆటగాడిగా ఆస్వాదించాను. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది చూసే క్రికెట్​ మ్యాచ్​లను మరేదీ అధిగమించలేదని నా అనుభవం నుంచి తెలుసుకున్నాను. ప్రపంచకప్​ నిర్వహించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను"

- సౌరభ్​ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

టీ20 ప్రపంచకప్​లో మొత్తంగా 16 జట్లు పాల్గొనున్నాయి. వచ్చే ఏడాది అక్టోబరు-నవంబరు మధ్య జరిగే ఈ టోర్నీలో భారత్​, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్​, ఇంగ్లాండ్​, ఐర్లాండ్​, నమీబియా, నెదర్లాండ్స్​, న్యూజిలాండ్​, ఒమన్​, పాకిస్థాన్​, పాపువా న్యూగినియా, స్కాట్లాండ్​, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్​ జట్లు ఇందులో ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.