ETV Bharat / sports

ఆ టెస్టు సిరీస్​ నాకెంతో ప్రత్యేకమైంది: అక్రమ్​ - అనిల్​ కుంబ్లే

భారత్​-పాకిస్థాన్​ మధ్య 1999లో జరిగిన టెస్టు సిరీస్​ తనకు ఎంతో ప్రత్యేకమైందని తాజాగా వెల్లడించాడు పాక్ జట్టు​ మాజీ కెప్టెన్​ వసీం అక్రమ్​. భారత గడ్డపై ఆడి గెలిచిన క్షణాలు తనకు ప్రత్యేక అనుభూతినిచ్చాయని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

India tour of 1999 was one of my favourites: Wasim Akram
ఆ టెస్టు సిరీస్​ నాకెంతో ప్రత్యేకమైనది: అక్రమ్​
author img

By

Published : Jun 17, 2020, 8:42 AM IST

భారత్​-పాకిస్థాన్​ కలిసి ఆడిన సిరీస్​ల్లో 1999లో జరిగిన టెస్టు సిరీస్​ తనకు ఎంతో ప్రత్యేకమైందని తెలిపాడు పాక్​ మాజీ కెప్టెన్​ వసీం అక్రమ్​. భారత​ గడ్డపై ఒత్తిడిలోనూ గెలవడం, ఓడడం ఓ ప్రత్యేక అనుభూతినిచ్చిందని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా మాజీ ఆల్​రౌండర్​ షేన్​ వాట్సన్​తో జరిగిన ఆడియో ఆధారిత ఇంటర్వ్యూలో అక్రమ్​ వెల్లడించాడు.

"90ల్లో మాకు భారత్​కు మధ్య అనేక మ్యాచ్​లు జరిగాయి. అయితే వాటిలో 1999లో జరిగిన టెస్టు సిరీస్​ నాకు ఎంతో ప్రత్యేకమైంది. ఆ సిరీస్​లో పాకిస్థాన్​ జట్టుకు నేనే కెప్టెన్​. తొలి మ్యాచ్​ చెన్నైలో జరిగింది. మైదానంలోకి వెళ్లే ముందు మా జట్టు ఆటగాళ్లతో మాట్లాడాను. స్డేడియం అంతా నిశ్శబ్దంగా ఉంటే మన పని మనం బాగా చేస్తున్నట్లు అర్థమని చెప్పాను. భారత్​లో మా జట్టుకు మద్దతు ఎలా అయితే లభించదో.. అదే విధంగా పాక్​లో భారత్​కు సపోర్ట్ ఉండదు."

- వసీం అక్రమ్​, పాకిస్థాన్​ మాజీ కెప్టెన్​

రెండు మ్యాచ్​ల ఈ టెస్టు సిరీస్ 1-1 తేడాతో డ్రాగా ముగిసింది. చెన్నై వేదికగా జరిగిన తొలి మ్యాచ్​లో 12 పరుగుల తేడాతో భారత్​పై పాకిస్థాన్​ గెలిచింది. ఆ తర్వాత దిల్లీలోని ఫిరోజ్​షా కోట్ల మైదానం(అరుణ్​ జైట్లీ స్టేడియం)లో జరిగిన రెండో టెస్టులో 212 పరుగుల భారీ వ్యత్యాసంతో భారత్​ నెగ్గింది. పాక్​తో జరిగిన రెండో మ్యాచ్​ రెండో ఇన్నింగ్స్​లో భారత మాజీ స్పిన్నర్ అనిల్​ కుంబ్లే 10 వికెట్లు సాధించడం విశేషం.

ఇదీ చూడండి... 'ఆస్ట్రేలియాతో పింక్​బాల్​ టెస్టు పెద్ద సవాల్​!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.