ETV Bharat / sports

ఐసీసీ ఛైర్మన్​ రేసులో మరో మాజీ క్రికెటర్​ - ఐసీసీ ఛైర్మన్​ రేసులో మరో మాజీ క్రికెటర్​

ఐసీసీ ఛైర్మన్​ పదవి కోసం తాను పోటీచేయనున్నట్లు విండీస్ బోర్డు మాజీ అధ్యక్షుడు డేవ్​ కేమరూన్​ చెప్పారు. తాను ఎన్నికైతే క్రికెట్​లో కొత్త మార్పులు తీసుకొస్తానని తెలిపారు.

Dave Cameron
డేవ్​ కేమరూన్​
author img

By

Published : Jun 29, 2020, 8:33 PM IST

Updated : Jun 29, 2020, 8:43 PM IST

ఐసీసీ ఛైర్మన్ కాలవ్యవధి త్వరలో పూర్తి కానుంది. ఇప్పుడు ఈ పదవి రేసులో మరో కొత్త పేరు ముందుకొచ్చింది. వెస్టిండీస్​ క్రికెట్​ బోర్డు మాజీ అధ్యక్షుడు డేవ్​ కేమరూన్​​.. ఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించారు. తాను ఎన్నికైతే క్రికెట్​లో కొత్త మార్పులు తీసుకొస్తానని హామీ ఇచ్చారు.

"నేను ఛైర్మన్​ పదవికి ఎన్నికైతే.. స్థిరమైన ఆర్థిక విధానాన్ని తీసుకొస్తాను. తద్వారా అన్ని క్రికెట్​ బోర్డులు ఎదిగేందుకు ఇది ఉపయోగపడుతుంది. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్​ ప్రాచుర్యం పొందే దిశగా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. క్రికెట్​లో కొత్త విధివిధానాలు తీసుకొస్తాను. తక్కువ ఈవెంట్లు నిర్వహించి ఎక్కువ మొత్తంలో ఆర్జించేలా ప్రణాళికలను సిద్ధం చేస్తాను"

-డేవ్​ కేమరూన్​, వెస్టిండీస్​ మాజీ క్రికెటర్​

గత నాలుగేళ్లుగా ఐసీసీ ఛైర్మన్‌గా ఉన్న శశాంక్‌ మనోహర్‌ పదవీకాలం జులైతో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో జరిగే ఐసీసీ వార్షిక సమావేశంలో కొత్త అధ్యక్షుడు ఎంపిక ప్రక్రియపై స్పష్టత ఇవ్వనున్నారు. అయితే ఈ పదవి రేసులో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, ఈసీబీ చీఫ్​ కొలిన్ గ్రేవ్​ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

dave
డేవ్​ కేమరూన్
icc
ఐసీసీ

ఇది చూడండి : టెస్టు ఛాంపియన్​ షిప్​ రీషెడ్యూల్​పై త్వరలో నిర్ణయం!

Last Updated : Jun 29, 2020, 8:43 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.