ETV Bharat / sports

ఆసీస్​పై 'డబుల్​ సెంచరీ' వీరులు వీరే..! - భారత్Xఆస్ట్రేలియా

త్వరలోనే ఆస్ట్రేలియా వేదికగా ఆసీస్​ జట్టుతో తలపడనుంది భారత్​. ఈ నేపథ్యంలో క్రికెట్​ అభిమానులకు మరింత ఆసక్తి పెరుగుతోంది. అయితే, గతంలో మెరుపు ఇన్సింగ్స్​ ఆడి కంగారూ​ జట్టుకు చుక్కలు చూపించిన భారత్​ బ్యాట్స్​మెన్లు చాలా మందే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆసీస్​పై ద్విశతకాలు సాధించిన వారిపై ప్రత్యేక కథనం మీ కోసం..

double tons against australia
ఆసీస్​పై 'డబుల్​ సెంచరీ' చేసింది వీరే...!
author img

By

Published : Nov 23, 2020, 5:46 AM IST

మరో ఐదు రోజుల్లో భారత్​-ఆస్ట్రేలియా సిరీస్​ ప్రారంభం కానుంది. కరోనా తర్వాత టీమ్​ఇండియా ఆడనున్న తొలి అంతర్జాతీయ సిరీస్​​ కనుక అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్​లో ఎవరు నెగ్గుతారన్నది ఫ్యాన్స్​లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సందర్భంగా ఇప్పటివరకు ఆసీస్​తో జరిగిన పోరుల్లో ద్విశతకాలు చేసిన ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.

సచిన్​ తెందుల్కర్ ​(241*, 214)

ఆసీస్ గడ్డపై సచిన్​ తెందుల్కర్​ 2004లో మొదటిసారి డబుల్​ సెంచరీ చేశాడు. సిడ్నీలో జరిగిన ఈ మ్యాచ్​లో ఆస్ట్రేలియాపై ఫస్ట్​ ఇన్నింగ్స్​లో 241 పరుగులు చేశాడు లిటిల్ మాస్టర్. ఆ తర్వాత 2010లో బెంగళూరు వేదికగా ఆసీస్​తో తలపడ్డ మ్యాచ్​లోనూ రెండో ద్విశతకాన్ని బాదాడు సచిన్.

double tons against australia
సచిన్ తెందూల్కర్

వీవీఎస్​ లక్ష్మణ్ (281, 200*)

2001 కోల్​కతా ఈడెన్​ గార్డెన్స్​లో జరిగిన టెస్ట్​లో వీవీఎస్​ లక్ష్మణ్​ ఆస్ట్రేలియాపై 281 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. 2008 దిల్లీ టెస్టులో 200 నాటౌట్​తో రాణించాడు.

double tons against australia
వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్​ ద్రవిడ్

ఛెతేశ్వర్​ పుజారా(204, 202)

హైదరాబాద్​ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో పుజారా 204 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్​ 2013లో జరిగింది. రాంచీ వేదికగా 2017లో ఛెతేశ్వర్​ పుజారా.. ఆసీస్​ జట్టుపై మరో ద్విశతకం చేశాడు.

double tons against australia
చతేశ్వర్ పుజారా

రవి శాస్త్రి (206)

ప్రస్తుతం భారత జట్టుకు కోచ్​గా వ్యవహరిస్తోన్న రవిశాస్త్రి 1992లో సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్​లో ఆసీస్​పై డబుల్​ సెంచరీ చేశాడు.

double tons against australia
రవిశాస్త్రి

రాహుల్ ద్రవిడ్(233)

2003లో జరిగిన ఆడిలైడ్​ టెస్ట్​లో 233 పరుగుల మెరుపు ఇన్సింగ్స్ ఆడాడు రాహుల్​ ద్రవిడ్. ఈ మ్యాచ్​లో ఆసీస్​పై భారత్​ నెగ్గింది.

గౌతమ్​ గంభీర్(206)

2008లో హోంగ్రౌండ్​ దిల్లీలో గౌతమ్​ గంభీర్​ ఆస్ట్రేలియాపై చెలరేగిపోయాడు. 206 పరుగులు చేశాడు. వీవీఎస్​ లక్ష్మణ్​ తన రెండో డబుల్​ టన్​ చేసింది కూడా ఈ మ్యాచ్​​లోనే కావడం విశేషం.

double tons against australia
గౌతమ్ గంభీర్

ఎం ఎస్​ ధోనీ(224)

భారత జట్టు మాజీ సారథి ఎంఎస్ ధోనీ చెన్నై టెస్టులో ఆస్ట్రేలియాపై ద్విశతకం చేశాడు. ఇదే ధోనీ మొదటి డబుల్​ కావడం విశేషం.

double tons against australia
ధోనీ

వన్డేల్లో ఒకే ఒక్కడు..

రోహిత్​ శర్మ(209)

వన్డే మ్యాచ్​ల్లో ఆస్ట్రేలియాపై డబుల్​ సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్​మెన్​గా రోహిత్​ శర్మ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 2013లో బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో హిట్​మ్యాన్ 209 పరుగులు చేశాడు. 158 బంతుల్లో 12 సిక్సులు, 16 ఫోర్లతో రోహిత్​ ఆసీస్​ జట్టుకు చుక్కలు చూపించాడు.

double tons against australia
రోహిత్ శర్మ

ఇదీ చదవండి:ఆసీస్​తో టెస్టు సిరీస్​కు రోహిత్​, ఇషాంత్​ కష్టమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.