టీ20 ఫార్మాట్లో 500 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఘనత సాధించాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు నేతృత్వం వహిస్తున్న 36 ఏళ్ల బ్రావో.. బుధవారం సెయింట్ లూసియా జూక్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ మైలురాయిని అందుకున్నాడు. రకీమ్ కార్న్‌వాల్ అతడి 500వ వికెట్.
![బ్రావో](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/725971-bravo-cpl-twitter_2608newsroom_1598462051_42.jpg)
బ్రావో ఇప్పటివరకు 459 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అతడు ప్రపంచ వ్యాప్తంగా వివిధ లీగుల్లో 15 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. విశేషమేంటంటే పొట్టి ఫార్మాట్లో మరే బౌలర్ కూడా కనీసం 400 వికెట్లు దాటలేదు. అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బ్రావో (501) తర్వాత లసిత్ మలింగ (390) రెండో స్థానంలో ఉన్నాడు. సునీల్ నరైన్ (383)ది మూడో స్థానం. ఐపీఎల్‌లో బ్రావో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతడు ఐపీఎల్‌లో 134 మ్యాచ్‌ల్లో 147 వికెట్లు పడగొట్టాడు.
తంబె 48 ఏళ్ల వయసులో..
కరీబియన్ ప్రిమియర్ లీగ్‌లో ఆడిన తొలి భారత క్రికెటర్‌గా లెగ్‌స్పిన్నర్‌గా ప్రవీణ్ తంబె నిలిచాడు. 48 ఏళ్ల తంబె బుధవారం ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ తరఫున తన తొలి మ్యాచ్ ఆడాడు. సెయింట్ లూసియాపై ఒక ఓవర్ బౌలింగ్ చేసి ఒక వికెట్ పడగొట్టాడు. అతడు ఐపీఎల్‌లో 33 మ్యాచ్‌లు ఆడాడు.