బయో బబుల్ వల్ల పశ్చిమ దేశాలకు చెందిన క్రికెటర్లు మానసిక సమస్యలు ఎదుర్కొంటారని పాకిస్థాన్ ప్రధాన కోచ్ మిస్బా ఉల్ హక్ అభిప్రాయపడ్డాడు. ఈ విధానంలో ఆట కొనసాగితే వారికి ఆ సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదముందని చెప్పాడు.
"బయో బబుల్‌లో క్రికెట్ ఇంకా కొనసాగితే ఆటగాళ్లతో పాటు జట్టు సిబ్బంది మానసిక సమస్యలు ఎదుర్కొనే ప్రమాదముంది. అయితే మా(పాక్) క్రికెటర్లు మాత్రం మానసికంగా చాలా ఆరోగ్యవంతులు, బబుల్‌కు బాగా అలవాటుపడిపోయారు. ఇదే విధానం ఇంకొన్నాళ్లు ఉంటే పశ్చిమ దేశాలకు చెందిన ఆటగాళ్లు, సిబ్బంది మాత్రం మానసికంగా ఇబ్బంది పడొచ్చు" -మిస్బా ఉల్ హక్, పాక్ ప్రధాన కోచ్
ఆగస్టులో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్.. బయో బబుల్‌లోనే సిరీస్‌లు ఆడింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ కూడా యూఏఈలో ఇదే విధానంలో జరుగుతోంది.
పాక్ జట్టు చీఫ్ సెలెక్టర్‌గా ఇటీవల తప్పుకున్న మిస్బా.. హెడ్ కోచ్ బాధ్యతలపై పూర్తిగా దృష్టిసారించడమే తన ప్రధాన కర్తవ్యమని అన్నాడు. వైదొలగిన విషయంలో ఎవరి ప్రమేయం లేదని చెప్పాడు.