ETV Bharat / sports

ఐపీఎల్ మరో​ అధికారిక భాగస్వామిగా 'క్రెడ్​' - ipl cred official partner

ఈ ఏడాది ఐపీఎల్​కు ప్రముఖ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ ప్లాట్‌ఫాం 'క్రెడ్‌' (సీఆర్‌ఈడీ)ని రెండో అధికారిక భాగస్వామిగా ప్రకటించింది బీసీసీఐ. ఇటీవల 'అన్​అకాడమీ' సంస్థను ఓ భాగస్వామిగా ఎంపిక చేసింది బోర్డు.

CRED
క్రెడ్
author img

By

Published : Sep 2, 2020, 4:00 PM IST

ఐపీఎల్​ 13వ సీజన్​కు చెందిన మరో అధికారిక భాగస్వామి పేరును ప్రకటించింది బీసీసీఐ. ప్రముఖ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ ప్లాట్‌ఫాం 'క్రెడ్‌' (సీఆర్‌ఈడీ)ను ఇందుకు ఎంపిక చేసింది. ఇప్పటి నుంచి మూడేళ్ల పాటు ఒప్పందం కొనసాగుతుందని ట్విట్టర్​ వేదికగా స్పష్టం చేసింది భారత బోర్డు.

ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో.. బీసీసీఐ గొప్ప నిర్ణయం తీసుకుందని అన్నారు బోర్డు అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ. ఈ మెగాలీగ్​లో భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు క్రెడ్​ సంస్థ సీఈఓ కునాల్​ షా.

ఇటీవల బెంగళూరుకు చెందిన ఆన్​లైన్​ ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థ 'అన్​ అకాడమీ'ని అధికార భాగస్వామిగా ప్రకటించింది బోర్డు. అంతకు ముందు ఐపీఎల్​ 13 టైటిల్​ స్పాన్స్​ర్​గా 'డ్రీమ్​ 11' ఎంపికైంది.

దుబాయ్​ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు బయోసెక్యూర్​ వాతావరణంలో ఈ మెగాలీగ్​ జరగనుంది. అబుదాబి, షార్జా, దుబాయ్ వేదికల్లో మొత్తం 53 రోజులు ఈ టోర్నీ నిర్వహించనున్నారు.

ఇది చూడండి ఐపీఎల్​ అధికారిక భాగస్వామి 'అన్​అకాడమీ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.