ETV Bharat / sports

ఆసియాకప్ జరుగుతుంది.. కానీ పాక్​లో కాదు! - Asia Cup will go ahead in either Sri Lanka or UAE: PCB CEO

షెడ్యూల్​ ప్రకారం ఆసియా కప్ జరుగుతుందని పాక్ బోర్డు సీఈఓ వసీమ్ ఖాన్ చెప్పారు. శ్రీలంకలో లేదంటే యూఏఈలో నిర్వహిస్తామని అన్నారు.

ఆసియా కప్ జరుగుతుంది.. కానీ పాక్​లో కాదు!
ఆసియా కప్ 2020
author img

By

Published : Jun 24, 2020, 1:39 PM IST

కరోనా నేపథ్యంలో టీ20 ప్రపంచకప్​ ఇప్పటికే వాయిదా పడే సూచనలు కనిపిస్తుండగా, ఆసియా కప్​ జరుగుతుందా? లేదా? అనే సందేహాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన పాకిస్థాన్ బోర్డు సీఈఓ వసీమ్ ఖాన్.. కచ్చితంగా టోర్నీని నిర్వహిస్తామని అన్నారు. అయితే తమ దేశంలో జరగకపోవచ్చని కరాచీలో జరిగిన ఓ మీడియా కాన్ఫరెన్స్​లో వెల్లడించారు.

PAK CRICKET BOARD
పాక్ క్రికెట్ బోర్డు

"ఆసియా కప్ ఈ ఏడాది జరుగుతుంది. ఇంగ్లాండ్ నుంచి సెప్టెంబరు 2న పాకిస్థాన్, స్వదేశానికి తిరిగొస్తుంది. దీనిబట్టి సెప్టెంబరు, అక్టోబరులో టోర్నీని నిర్వహిస్తాం. శ్రీలంకలో తక్కువ కరోనా కేసులు ఉన్నందున అక్కడే ఆసియా కప్​ జరపాలని భావిస్తున్నాం. వారు కాదంటే యూఏఈ సిద్ధంగా ఉంది" -వసీమ్ ఖాన్, పాక్ బోర్డు సీఈఓ

టీ20 ప్రపంచకప్​ రద్దయితే, అందుకు కేటాయించిన సమయాన్ని ఆసియాకప్​ కోసం ఉపయోగిస్తామని అన్నారు వసీమ్. అయితే అదే సమయంలో ఐపీఎల్​ నిర్వహించాలని బీసీసీఐ కూడా భావిస్తోంది. మరి ఏమవుతుందో చూడాలి?

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.