ETV Bharat / sports

'ఈ సిరీస్​లో కోహ్లీ కూడా విఫలమయ్యాడు' - 'ఈ సిరీస్​లో కోహ్లీ కూడా విఫలమయ్యాడు నెహ్రా

న్యూజిలాండ్​తో జరిగిన వన్డే సిరీస్​లో టీమిండియా పేసర్ బుమ్రా విఫలమయ్యాడు. దీనిపై పలువురు పలు రకాలుగా మాట్లాడుతున్నారు. తాజాగా భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా ఈ విషయంపై స్పందించాడు.

నెహ్రా
నెహ్రా
author img

By

Published : Feb 13, 2020, 7:39 PM IST

Updated : Mar 1, 2020, 6:03 AM IST

న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా ప్రధాన బౌలర్‌ జస్ప్రిత్‌ బుమ్రా ఒక్క వికెట్‌ కూడా తీయకుండా విఫలమవడంపై మాజీ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా స్పందించాడు. అతడికి మద్దతుగా నిలిచాడు.

"ప్రతి సిరీస్‌లో బుమ్రా రాణించాలనుకోవడం సరికాదు, అతడు ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. ఆడిన ప్రతిసారి అత్యుత్తమ ప్రదర్శన ఎవరికీ సాధ్యం కాదు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కూడా ఈ సిరీస్‌లో విఫలమయ్యాడు."

-ఆశిష్ నెహ్రా, టీమిండియా మాజీ పేసర్

రెండేళ్లుగా బుమ్రా, మహ్మద్‌ షమి టీమిండియాకు కీలక బౌలర్లుగా వ్యవహరిస్తున్నారు. డెత్‌ ఓవర్లలో కట్టుదిట్టమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో బౌలింగ్ చేస్తూ జట్టును విజయపథంలో నడిపిస్తున్నారు.

తుది జట్టును ప్రకటించే ముందు జట్టు యాజమాన్యం సరైన నిర్ణయాలు తీసుకోవాలని.. బుమ్రా, షమి కాకుండా మిగతా పేస్‌ బౌలర్లు తమ బాధ్యతల్ని గుర్తించాలని నెహ్రా ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రధాన బౌలర్లపైనే ఆధార పడకుండా తమ వంతు కృషి చేయాలన్నాడు. బుమ్రాపై అధిక ఒత్తిడి పెరిగిపోతుందని మాజీ పేసర్‌ తెలిపాడు. అలాగే టీ20ల్లో మంచి ప్రదర్శన చేస్తున్న నవ్‌దీప్‌ సైనీని కివీస్‌తో టెస్టు సిరీస్‌కు తీసుకోవాలని సూచించాడు. ఉమేశ్‌ యాదవ్‌ కన్నా సైనీనే మంచి ప్రదర్శన చేస్తాడని తెలిపాడు. నవ్‌దీప్‌కు అవకాశాలిస్తే సరైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బంతులేసి భవిష్యత్తులో వికెట్లు తీస్తాడని నెహ్రా చెప్పాడు.

Last Updated : Mar 1, 2020, 6:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.