టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటై రెండున్నరేళ్లు అవుతోంది. అయితే తాజాగా ఈ ఇద్దరూ ముగ్గురు కాబోతున్నట్లు తెలిపారు. అవును.. ఈ జోడీ త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఈ విషయాన్ని వీరే స్వయంగా సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు.
-
And then, we were three! Arriving Jan 2021 ❤️🙏 pic.twitter.com/0BDSogBM1n
— Virat Kohli (@imVkohli) August 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">And then, we were three! Arriving Jan 2021 ❤️🙏 pic.twitter.com/0BDSogBM1n
— Virat Kohli (@imVkohli) August 27, 2020And then, we were three! Arriving Jan 2021 ❤️🙏 pic.twitter.com/0BDSogBM1n
— Virat Kohli (@imVkohli) August 27, 2020
చాలా కాలంగా అనుష్క గర్భవతి అంటూ పుకార్లు వచ్చాయి. వీటిపై కొన్నిసార్లు స్పందించిన ఈ నటి ఈ మధ్య ఆ వార్తల్ని తేలికగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు వీరే ఈ ప్రకటన చేయడం వల్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. వచ్చే ఏడాది జనవరిలో తన బిడ్డకు జన్మనివ్వబోతుంది అనుష్క.