ETV Bharat / sports

అయ్యో పాక్​.. మ్యాచ్​లు లేక స్టేడియంలో పంటల సాగు - ఖలేవాల్ స్టేడియం

పాకిస్థాన్​లోని క్రికెట్ స్టేడియాలు క్రమంగా వ్యవసాయ క్షేత్రాలుగా మారుతున్నాయి. తాాజాగా స్టేడియంలో కూరగాయ పంటలు పండించడం దీనికి అద్దం పడుతోంది. అసలు పాక్​కు అసలు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? అక్కడ మ్యాచ్​లు నిర్వహించకపోవడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం.

Khanewal
ఖలేవాల్
author img

By

Published : Aug 19, 2021, 4:04 PM IST

భారత్​లాగే పాకిస్థాన్​లోనూ క్రికెట్​కు మంచి ఆదరణ ఉంది. ఒకప్పుడు దిగ్గజ ఆటగాళ్లను అందించిన ఈ దేశం 2009లో ఉగ్రదాడుల తర్వాత క్రికెట్ మ్యాచ్​లను నిర్వహించే వీల్లేకుండా పోయింది. ఇటీవలే మళ్లీ పాక్​లో ఆడేందుకు కొన్ని జట్లు ముందుకొస్తున్నాయి. ఇంగ్లాండ్, న్యూజిలాండ్​ జట్లు కూడా మరికొద్ది నెలల్లో అక్కడ పర్యటించనున్నాయి. అయితే కరోనా ఆ దేశ క్రికెట్​ మైదానాలను నాశనం చేసిందనే చెప్పాలి. అందుకు నిదర్శనం ఈ స్టేడియం.

స్టేడియంలో వ్యవసాయం..

ఓవైపు పాకిస్థాన్​లో అంతర్జాతీయ మ్యాచ్​లు ఎక్కువగా జరగట్లేదు, మరోవైపు కరోనా. దీంతో ఆ దేశంలో ప్రస్తుతం లాహోర్, కరాచీల్లోనే మ్యాచ్​లు జరుగుతున్నాయి. ముల్తాన్, ఫైసలాబాద్​లో ఆడేందుకు వీలున్నా అది కుదరట్లేదు. దీంతో కనీసం దేశవాళీ మ్యాచ్​లైనా నిర్వహించే వీలులేకపోవడం వల్ల పంజాబ్ ప్రావిన్స్​లోని ఖనేవాల్​ స్టేడియంలో కూరగాయలు పండిస్తున్నారు.

  • Where are authorities????
    Look how they are destroying 🏏 stadium, how they are playing with future of 🇵🇰, this is KHANEWAL’s Cricket Stadium’ Sad story....
    کاش کسی کو پاکستان کے مستقبل کی فکر ہو تو یہ مرچیں کھلاڑیوں کے زخموں پر نہ لگیں pic.twitter.com/r3A8K2UfWt

    — Shoaib Jatt (@Shoaib_Jatt) August 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

లక్షలు ఖర్చు చేసి..

దేశంలో క్రికెట్​ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, క్రికెటర్ల సౌకర్యార్థం లక్షల రూపాయలు వెచ్చించి ఖనేవాల్ స్టేడియాన్ని నిర్మించారు. మంచి ప్రాక్టీస్ ఏరియా, పెవిలియన్​తో పాటు ఇందులో అత్యాధునికి సౌకర్యాలు ఉన్నాయి. కానీ కొంతకాలంగా ఇందులో పంటలు పండిస్తున్నారు. కనీసం దేశవాళీ మ్యాచ్​లకైనా అవకాశం లేకుండా స్డేడియంలో మిరపకాయ, గుమ్మడి వంటి పంటలు వేస్తున్నారు.

మళ్లీ గాడిన పడుతుందా?

సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వరుసగా న్యూజిలాండ్, ఇంగ్లాండ్​కు అతిథ్యం ఇవ్వనుంది పాక్. అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతోనూ సిరీస్​ ఆడనుంది. దీంతో పాక్ క్రికెట్​కు పూర్వవైభవం వస్తుందని పీసీబీ భావిస్తోంది. ఈ సిరీస్​లు సజావుగా జరిగితే రెగ్యులర్​గా పాక్ గడ్డపై సిరీస్​లు జరిగే వీలుంటుందని ఆశిస్తున్నారు. ఇదే జరిగితే ఇక్కడి స్టేడియాలకు పునఃవైభవం రావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇవీ చూడండి: 'కోహ్లీ నోరు తెరిస్తే బూతు మాటలే!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.