ETV Bharat / sports

చివరి ఓవర్‌లో వారిద్దరే నా ఛాయిస్‌.. కానీ: రోహిత్‌ శర్మ

author img

By

Published : Nov 3, 2022, 7:28 AM IST

టీ20 ప్రపంచకప్‌ హోరా హోరీగా జరుగుతోంది. బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇరు జట్ల కెప్టెన్లు తమ గెలుపోటములపై స్పందించారు. ఏమన్నారంటే..?

రోహిత్​ శర్మ
rohit sharma

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం ఇరు జట్ల కెప్టెన్లు తమ గెలుపోటములపై స్పందించారు. బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ మాట్లాడుతూ తాము ఓడినా మ్యాచ్‌ను ఆద్యంతం ఆస్వాదించామని తెలిపాడు. అయితే ఆఖరి క్షణాల్లో మ్యాచ్‌ చేజారిపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

"టీమ్‌ఇండియాతో ప్రతిసారీ ఇదే చిక్కొచ్చిపడుతుంది. గెలుపు దాదాపు ఖరారైందని అనుకుంటాం కానీ అది పూర్తవకుండానే వెనుదిరుగుతాం. కానీ చివరగా ఎవరో ఒకరు గెలవాలి.. ఒకరు ఓడిపోవాల్సిందే. లిటన్‌ దాస్‌ మాకున్న అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌. పవర్‌ప్లేలో అతడి ఆటతో గెలుస్తామనే నమ్మకం కలిగింది. టీమ్‌ఇండియా టాప్‌ 4 ఆటగాళ్లు చాలా ప్రమాదకరం. వారిని ఔట్‌చేసేందుకే టస్కిన్‌తో బౌలింగ్‌ చేయించాం. కానీ మా ప్లాన్‌ బెడిసికొట్టింది" అంటూ షకిబ్‌ వ్యాఖ్యానించాడు.

టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్‌ కోహ్లీ, అర్ష్‌దీప్‌ సింగ్‌, కేఎల్‌ రాహుల్‌ను ప్రశంసించాడు. "బుమ్రా లేకపోవడంతో ఆ స్థానంలో ఈ యువ ఆటగాడిని మేం ఎప్పటి నుంచో సిద్ధం చేసి ఉంచాం. చివరి ఓవర్‌లో షమీ, అర్ష్‌దీప్‌లో ఒకరిని ఎంచుకోవాలనుకున్నాం. కానీ 9 నెలలుగా చివరి ఓవర్లలో రాణిస్తోన్న అర్ష్‌దీప్‌కు ఆ అవకాశం ఇచ్చాం. కోహ్లీ ఈ టీ20 ప్రపంచకప్‌లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. కేఎల్‌ రాహుల్‌ ఎంత అద్భుతమైన ఆటగాడో ఈ మ్యాచ్‌తో మరోసారి నిరూపించుకున్నాడు. ఇక ఫీల్డింగ్‌ విషయంలో మా కుర్రాళ్లు అదరగొట్టారు. కొన్ని అద్భుతమైన క్యాచ్‌లను అందుకుని సత్తా చాటారు" అంటూ హర్షం చేశాడు.

ఆటను మలుపు తిప్పిన ఆటగాడిగా నిలిచిన కేఎల్‌ రాహుల్‌ తన ఇన్నింగ్స్‌పై సంతోషం వ్యక్తం చేశాడు. "మొదటి మూడు మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేకపోయాను. అది నన్నెంతో నిరాశపరిచింది. కానీ నా ఫామ్‌ కోల్పోతున్నాననో, ఆత్మవిశ్వాసం తగ్గుతుందనో నేనెప్పుడూ బాధపడలేదు. ఎప్పటికైన ఇలాంటి ఒక ఇన్నింగ్స్ ఆడతానని నా మనసుకు తెలుసు. క్లిష్ట సమయంలో కెప్టెన్‌, సహచర ఆటగాళ్లు నా వెంట నిలిచారు. నా సామర్థ్యాన్ని వారెప్పుడూ శంకించలేదు. అదెంతో బలాన్నిచ్చింది" అంటూ రాహుల్‌ తెలిపాడు.

ఇదీ చదవండి: టీ20ల్లో వరల్డ్​ నెం.1గా సూర్య కుమార్ యాదవ్​.. ప్రపంచకప్​లో కోహ్లీ అద్భుత ఘనత

'రాహుల్-సూర్యకుమార్​ అలా చేస్తారని అస్సలు ఊహించలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.