ETV Bharat / sports

యువ క్రికెటర్​పై రోహిత్ కోపం.. ఏమైందంటే? - ind vs wi

Rohit sharma: చాలారోజుల తర్వాత భారత జట్టు తరఫున ఆడిన ప్రసిద్ధ్.. విండీస్​తో తొలి వన్డేలో చిన్న పొరపాటు చేశాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ.. కోపం అదుపు చేసుకోలేకపోయాడు.

rohit sharma
రోహిత్ శర్మ
author img

By

Published : Feb 7, 2022, 11:14 AM IST

IND vs WI: టీమ్​ఇండియా కెప్టెన్​గా రోహిత్ శర్మ.. తొలి మ్యాచ్​లోనే అదరగొట్టేశాడు. డీఆర్​ఎస్​లోనూ సక్సెస్​ అయ్యాడు. వీటితో పాటు ఈ వన్డేలోనే కోపం కూడా చూపించాడు. ప్రస్తుతం ఇది చర్చనీయాంశమైంది.

ఇంతకీ ఏం జరిగింది?

మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 176 పరుగులు చేసింది. ఈ జట్టు అంతకంటే తక్కువ పరుగులు చేయాల్సింది కానీ హోల్డర్​ హాఫ్ సెంచరీ చేయడంతో గౌరవప్రదమైన స్కోరు చేసింది.

captain rohit sharma
రోహిత్ శర్మ

అయితే ఇన్నింగ్స్ 32వ ఓవర్​లో చాహల్ బౌలింగ్​ హోల్డర్​.. డీప్ మిడ్​ వికెట్​ మీదుగా హిట్ చేశాడు. బౌండరీ లైన్ దగ్గర ఉన్న ప్రసిద్ధ్ కృష్ణ తడబడేసరికి, ఆ బంతి కాస్త బౌండరీ అవతల పడింది. అదికాస్త సిక్స్ అయింది. దీంతో కోపం పట్టలేకపోయిన రోహిత్.. ప్రసిద్ధ్​పై అరిచేశాడు.

ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​ చేసిన వెస్టిండీస్ 176 పరుగులు చేయగా, భారత్ దానిని 28 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధ సెంచరీతో ఆకట్టుకునే బ్యాటింగ్ చేశాడు. కోహ్లీ మరోసారి తక్కువ పరుగులే చేసి, ఫ్యాన్స్​ను నిరాశపరిచాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.